కేసినో వ్యవహారంపై ఉద్యమం చేస్తాం

Published: Tuesday January 25, 2022

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టిస్తోన్న గుడివాడ కేసినో వ్యవహారంపై ప్రజా ఉద్యమం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు  తెలిపారు. గుడివాడ వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉంగుటూరు పీఎస్‌కు వీర్రాజును తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మంత్రి కొడాలి నానికి తమను ఆపే‌ దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. పోలీసు, అధికార వ్యవస్ధ దిగజారిపోయిందని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ఐదేళ్లు మాత్రమే ఉంటాయనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని ఆయన పోలీసులకు గుర్తు చేశారు.