వైసీపీ కేసినో పార్టీ

Published: Thursday January 27, 2022

వైసీపీ కేసినో పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుడివాడకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే గుర్తొచ్చిందా?... రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కార్ ఏం చేస్తోందని నిలదీశారు. రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా వేయలేకపోయిందని మండిపడ్డారు. ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలంటే.. అధికారంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు. అలాగే పీఆర్సీ సమస్యలు ఉండవని సోమువీర్రాజు అన్నారు.