సీఎం పర్యటనలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం

Published: Wednesday February 09, 2022

సీఎం పర్యటనలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. శారదాపీఠం నుంచి సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవరకు వాహనాలను పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్ఏడీ జంక్షన్‌లో వాహనాలు నిలిచిపోయి విమాన ప్రయాణికులు ఇబ్బందులకు గురైయ్యారు. కొత్తవలస నుoచి వచ్చే వాహనాలను పోలీసులు రెండు గంటలుగా ఆపేశారు. విశాఖ పెందుర్తి జంక్షన్‌లో ట్రాఫిక్ జాం అయింది.