వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశం నిన్న(మంగళవారం, ఫిబ్రవరి 8 న) ప్రారంభమైంది. పదో తేదీ(గురువారం) వరకు ఈ సమావేశం జరుగుతుంది. ముగింపు రోజున ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపీసీ సమావేశం నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో... వ్యాపార వర్గాలు సహా ఆయా వర్గాల్లో ద్రవ్యచలామణి, ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు చుట్టూ చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఓ వైపు కరోనా ఆందోళన తగ్గుతున్ననేపధ్యంలో... వడ్డీ రేట్లు పెరుగుతాయా ? అదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణం కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? ద్రవ్యచలామణిపై ఏ రకంగా ముందుకెళతారు ? అన్న అంశాలు కీలకంగా మారాయి.
వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు సంకేతాలనిచ్చాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచనుంది. ఇదే దిశలో ఆర్‌బీఐ కూడా పెంచే అవకాశాలున్నాయా ? లేదా ? లేదా... కనీసం సంకేతాలనైనా ఇస్తుందా ? అన్న సందేహాలు కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే... కీలక వడ్డీ రేట్లు మరికొన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని ఓ చెబుతున్నారు. ఇదిలా ఉంటే... కరోనా నుండి కోలుకుంటున్న భారత్ పై ఒమిక్రాన్ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక కార్యకలాపాలు మరీ అంతగా పతనం కాలేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
ద్రవ్యోల్భణం కూడా భారీగా పెరుగుతున్నపన్పటికీ... ఇతర దేశాలతో పోలిస్తే మాతీ్రం కాస్త అదుపులో ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ ప్రభావం మనపై పడుతోంది. ఇది ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఏం చేస్తుందనేదన్నది ఆసక్తికరంగా మారింది.

Share this on your social network: