ఏపీ విద్యుత్ సంస్థలకు టీఎస్ విద్యుత్ సంస్థల లేఖ

Published: Thursday February 10, 2022

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ట్రాన్స్‎కో, జెన్‎కో సీఎండీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. 1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు రూ.2,900 కోట్లు దాచుకున్నారు. ఇటీవల ఏపీలోని నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌‎లలో ఉన్న నిధులు, డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌‎లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీపీఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ సొమ్ముపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయంగా ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలని సీఎండీ ప్రభాకర్ రావు, తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ లేఖలో కోరింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము ట్రాన్స్ ఫర్ చేయకుంటే ఏపీ విద్యుత్ పెన్షనర్లకు తిప్పలు తప్పవని తెలంగాణ విద్యుత్ జేఏసీ హెచ్చరించింది.