కాపలా సిబ్బందికి జీతాలూ బంద్‌అధ్వానంగా స్మారక ప్రదేశాలు

Published: Sunday February 13, 2022

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలంగాణలో పుట్టి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24 ఎకరాల్లో ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేసేవాళ్లం. దక్షిణాదికి చెందిన తెలుగు వాడైనందునే సీతారామరాజుపై కేంద్రం వివక్ష చూపుతున్నది. పార్లమెంటులో అల్లూరి విగ్రహం లేకపోవడం బాధాకరం’.. ఇటీవల హైదరాబాద్‌లో అల్లూరి 125à°µ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి à°ˆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాల నిర్వహణ, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. నాడు బ్రిటీష్‌ అధికారులు అల్లూరిని పట్టుకుని బంధించిన కొయ్యూరు మండలం మంప గ్రామంలో, ఆయనను రివాల్వర్‌తో కాల్చి చంపిన రాజేంద్రపాలెంలో, భౌతికకాయాన్ని దహనం చేసిన కృష్ణాదేవిపేట గ్రామంలోని స్మారక ప్రదేశాలను చూస్తే.. à°† మహనీయుడికి పాలకులు కనీస గౌరవం ఇవ్వడం లేదని అర్థం అవుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై అల్లూరి అభిమానులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి à°Žà°‚.మణికుమారి, భద్రాచలం ఎంపీ దుంపా మేరీ విజయకుమారి చొరవతో కృష్ణాదేవిపేటలో అల్లూరి పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి రూ.23లక్షలు మంజూరు చేయించి పార్కు మూడువైపులా ప్రహరీ, సమాధులున్న ప్రదేశంలో మందిరం, తదితర సౌకర్యాలు కల్పించారు. తర్వాత పదేళ్లకు అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప రూ.16లక్షల మంజూరు చేయించి పార్కులో భవనాన్ని నిర్మించారు. à°—à°¤ టీడీపీ హయాంలో అప్పటి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సుమారు రూ.60 లక్షలతో సందర్శకుల కోసం మూడు పగోడాలు, నడకదారుల్లో టైల్స్‌, విద్యుత్‌ దీపాలు, సిమెంట్‌/స్టీలు బెంచీలు, మినీ థియేటర్‌, పాత భవనానికి మరమ్మతులు, తాగునీటికి ఆర్వో ప్లాంటు, పార్కులో పచ్చదనానికి నీటి కోసం మోటారు ఏర్పాటు, తదితర పనులు చేయించారు. మంప, రాజేంద్రపాలెంలో అల్లూరి స్మారక ప్రదేశాలను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు 2017లో అప్పటి కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు ఎంపీ నిధుల నుంచి రూ.50లక్షల చొప్పున మంజూరు చేశారు. ఏడాదిన్నర తరువాత 2018లో నిధులు విడుదలయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో స్మారక ప్రదేశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. మంపలో కళామందిరం నిర్మాణం, బోరు, సీసీ నడకదారులు, టైల్స్‌, కొలనులో పూడికతీత, కొలను మధ్యలో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు దిమ్మ నిర్మాణం, స్మారక మందిరంలో నూతన విగ్రహం ఏర్పాటు, భవనానికి రంగులు వేయడం వంటి పనులు చేశారు. రాజేంద్రపాలెం స్మారక ప్రదేశంలో గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పూర్తిగా తొలగించారు. కొత్త భవనం, చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. నిధులు చాలకపోవడంతో ఇంకా పలు పనులు చేపట్టలేదు.

 

 

మంప, రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక ప్రదేశాలను సుమారు కోటి రూపాయలతో కొంతమేర అభివృద్ధి చేసినప్పటికీ వీటి నిర్వహణను గాలికొదిలేయడంతో అధ్వానంగా మారాయి. కనీసం స్వీపర్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. కొబ్బరి, పూలు, క్రోటన్‌ మొక్కలు ఎండిపోయాయి. ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. మంపలో కళామందిరం లోపల దుమ్ము, ఽధూళి పేరుకుపోయింది. ఇక్కడ మెయిన్‌ గేటు, మందిరం తలుపునకు తాళాలు వేయకపోవడంతో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. రాజేంద్రపాలెంలో ఆవరణను సరిగా చదును చేయకపోవడంతో ఎత్తుపల్లాలతో అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్‌ గేటుకు తాళం వేసి ఉండడం, తాళం చెవి ఎవరి వద్ద ఉందో తెలియకపోవడంతో సందర్శకులు లోపలికి వెళ్లడానికి వీలులేకపోయింది. ఇక కృష్ణాదేవిపేటలో అల్లూరి, ఆయన సేనాని గాము గంటందొర సమాధులున్న ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్మారక పార్కు నిర్వహణ లోపించి అధ్వానంగా తయారైంది. à°—à°¤ ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులను గాలికొదిలేయడంతో ఒక్కొక్కటిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.