ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Published: Tuesday February 15, 2022

 ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28 అర్ధరాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం జీవో నెంబరు 94 విడుదల చేసింది.  కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ కారణంగా నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. మాస్క్‌ ధరించని వారికి రూ. 10 వేల నుంచి 20 వేల వరకూ పెనాల్టీ విధించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.