సీఎం సూచనలతోనే పని చేశా

Published: Sunday February 20, 2022

రాష్ట్రం లో శాంతి భద్రతలు కాపాడే క్రమంలో గతంలో ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యానించారు. ఐపీఎస్‌ అధికారిగా 36ఏళ్ల కెరీర్‌ నేటితో ముగుస్తోందన్నారు. పోలీసు దళాల అధిపతిగా 32నెలల పాటు ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారమే పని చేశానని చెప్పారు. డీజీపీగా రిటైర్‌ అయి... ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సవాంగ్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరిచిన వాహనంలో సవాంగ్‌ దంపతులు నిలుచోగా... సీనియర్‌ అధికారులు దానిని లాగి తమ గౌరవం ప్రకటించారు. పోలీసుశాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చానని, బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న్యాయం చేశామని సవాంగ్‌ తెలిపారు.