రష్యా సైనికులను బందీలుగా చేసుకున్న ఉక్రెయిన్

Published: Thursday February 24, 2022

తమ దేశంపై దాడి చేసిన రష్యా సైనికుల్లో ఇద్దరిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్ రక్షణ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రష్యా క్షిపణిదాడుల్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు చనిపోయారని సమాచారం. ఇప్పటివరకూ 6 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచానికే ప్రమాదకరమైన సంకేతమని తెలిపింది. దాడులపై ప్రతీకారాన్ని రష్యా ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బెర్గ్ హెచ్చరించారు. దాడిని నాటో ఖండిస్తోందని, రష్యా వెంటనే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు.