ఉక్రెయిన్‌ దేశంలో సిక్కోలు విద్యార్థులు

Published: Thursday February 24, 2022

ఉక్రెయిన్‌ దేశంలో సిక్కోలు విద్యార్థులు చిక్కుకున్నారు. జిల్లాలోని వీరఘట్టాం మండలం కంబరివలస గ్రామానికి చెందిన కుమారస్వామి, వంశీకృష్ణ బోకోవిన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉక్రెయిన్‌ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో విద్యార్థుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామని తల్లిదండ్రులకు విద్యార్థులు వీడియో సందేశం పంపారు. తమ వారిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి వినతి చేశారు.