అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు

Published: Friday February 25, 2022

 à°…గ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసు ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వివాదాలను ఏలూరు జిల్లా కోర్టుకు హైకోర్టు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లు కూడా జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్లుగా అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులు హైకోర్టులో కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకు అభ్యర్థన తిరస్కరించారు. డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులన్నింటిపై హైకోర్టు విచారణ ముగించింది.