ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేది లేదా..

Published: Tuesday March 01, 2022

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేది లేదని రష్యా తెగేసి చెప్పింది. అన్ని లక్ష్యాలు నెరవేరే వరకు à°ˆ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించింది. ఆరో రోజు జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరం భీతావహంగా మారిన నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ మంగళవారం à°ˆ ప్రకటన చేశారు.

 

యూరోపు నుంచి అణ్వాయుధాలను అమెరికా ఉపసంహరించాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ డిమాండ్ చేశారు. లక్ష్యాలు నెరవేరే వరకు ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. 

ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యా సేనలు క్షిపణులను ప్రయోగించాయి. à°ˆ నగరంపై జరిగిన కాల్పుల్లో à°“ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. à°ˆ విషయాన్ని మంగళవారం భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.  ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా à°† దేశం విడిచిపెట్టడానికి అవకాశం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్ రాయబారులను విదేశాంగ శాఖ కార్యదర్శి కోరనున్నారు. 

ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో చేరాలనే యోచన లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మంగళవారం చెప్పారు. తమ గడ్డపై నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడుతున్నాయనే ఆరోపణలను ఖండించారు. 

 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం యూరోపియన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారని స్పీకర్ ప్రకటించారు.