టికెట్‌ ధరల ఫైల్‌పై జగన్‌ సంతకం

Published: Monday March 07, 2022

ఏపీలో సినిమా టికెట్‌ ధరల గురించి కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే! దీని గురించి సినీ పెద్దలు సీయం జగన్‌మోహన్‌ రెడ్డిని కలవడం, ఓ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కూడా మూడు వారాలు కావొస్తుంది. అయినా టికెట్‌ ధరలు పెంచుతూ జారీ చేయాల్సిన జీవోను ఏపీ ప్రభుత్వం ఇంకా పెండింగ్‌లో పెట్టింది.

తాజాగా ఏపీ సీఎం జగన్‌ టికెట్‌ ధరల ఫైల్‌ మీద సంతకం చేశారని, ఈరోజు లేదా మంగళవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టుకు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేస్తారట. ఇదే కనుక నిజమైతే చిత్ర పరిశ్రమకు, విడుదలకు సిద్ధమైన చిత్రాలకు శుభపరిణామమే!