2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

హైదరాబాద్;2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెడుతున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు, ఆకలి చావులు లేవన్నారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని తెలిపారు. ఆసరా, రైతు బంధు ఇలా ఏ పథకమైనా లబ్ధిదారులకే చేరుతుందని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం దాడి మొదలైందన్నారు. ఏడు మండలాలను ఏపీకి అక్రమంగా బదలాయించిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

Share this on your social network: