'కశ్మీర్ ఫైల్స్' వివాదంపై ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
Published: Sunday March 20, 2022

కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఏదైతే జరిగిందో దానికి పాకిస్థాన్, తీవ్రవాదం కారణాలని అన్నారు. జమ్మూలో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అతిపెద్ద హిందూ అని, అతిపెద్ద సెక్యురలిస్టు అని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు.

Share this on your social network: