కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు

Published: Wednesday March 30, 2022

కొత్త సంవత్సర వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 3 శాతం డిఏ, డియర్‌నెస్ రిలీఫ్ పెంచింది. ప్రస్తుతమున్న 31 నుంచి 34 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి ఇది వర్తిస్తుంది. మొత్తం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. 3 శాతం డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై 9,544.50 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.