కొత్త మంత్రి కోసం 3 గంటలు క్యూలైన్లలో భక్తుల నిలిపివేత

Published: Saturday April 16, 2022

 à°­à°¾à°°à±€ క్యూలైన్లలో చిక్కుకుని తిరుపతిలో భక్తులు గాయపడినా ప్రభుత్వ పెద్దల్లో మార్పులేదు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొత్త మంత్రి కొట్టు సత్యనారాయణ కోసం కొన్నిగంటలపాటు భక్తులను క్యూలైన్లలో నిలిపివేశారు. దీంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోబ్యాక్‌, డౌన్‌డౌన్‌ అని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కొత్త కేబినెట్‌లో కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు దేవదాయశాఖ బాధ్యతలను అప్పగించారు. ఆయన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు వచ్చారు. సెలవులు రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అయితే.. మంత్రి కోసం కంచుగడప వద్ద క్యూలైన్లను అధికారులు బ్లాక్‌ చేశారు. వేసవి ఉక్కపోతతో క్యూలైన్లలో భక్తులు ఉడికిపోయారు. à°† సమయంలో అటుగా వచ్చిన మంత్రి కొట్టుని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంకెన్ని గంటలు నిలబెట్టేస్తారంటూ వారు ప్రశ్నించారు. దీంతో అధికారులపై ఆగ్రహించిన మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.