డీజీపీకి లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published: Sunday September 02, 2018
విజయవాడ: à°“ మహిళా కానిస్టేబుల్‌ భర్త సాక్షాత్తు à°† శాఖ బాస్‌కు లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితమే à°† మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు ఆమె భర్త చనిపోవడానికి సిద్ధమయ్యాడు. దీనికి ముందు అతడు డీజీపీకి రాసిన లేఖ పోలీసు శాఖలోను కలకలం రేపుతోంది. గల్లా నాగరాజుది విజయవాడ కృష్ణలంక. అతడి భార్య నాగమణి కానిస్టేబుల్‌à°—à°¾ పనిచేసేది. సీసీఎ్‌సలో పనిచేసిన ఆమె à°ˆ ఏడాది మార్చి 19à°¨ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పోలీసుశాఖలో వేధింపుల కారణంగానే నాగమణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. అప్పట్లో నేర పరిశోధన విభాగం ఉపకమిషనర్‌à°—à°¾ వ్యవహరించిన షహీన్‌ బేగమ్‌ విచారణ నిర్వహించి అటువంటిదేమీ లేదని తేల్చారు. శనివారం రాత్రి నాగమణి భర్త నాగరాజు డీజీపీకి రెండు పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు యత్నించాడు.
 
చివరి పేజీలో కుమారుడితో తీయించుకున్న దంపతుల ఫొటోను అతికించాడు. తన చావుకు పశ్చిమ మండలం సహాయ కమిషనర్‌ వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ జె.నాగరాజు కారణమని రాశాడు. అందుకు à°—à°² కారణాలను పూసగుచ్చినట్టుగా వివరించాడు. జె.నాగరాజు వద్ద నుంచి నాగమణి దంపతులు కొద్దినెలల క్రితం కొంతమొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. à°† బకాయిని ఇప్పటి వరకు చెల్లించలేదు. ‘‘మార్చి 19à°¨ రాత్రిపూట విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చిన నాగమణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. à°ˆ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ నాగరాజు ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. దూరం నుంచి చూసి వెళ్లిపోయాడు. దీనిపై మాకు అనుమానం వచ్చింది. తర్వాత నా భార్య ఫోన్‌ చూడగా అందులో నాగరాజు నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు మమ్మల్ని డబ్బులు అడగలేదు.
 
నాగమణి ఆత్మహత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం పోలీసులు à°—à°¡à°šà°¿à°¨ నెల 14à°¨ స్టేషన్‌కు పిలిపించారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే నాకు తెలిసిన వివరాలన్నీ చెప్పాను. అనుమానం ఉన్న వారిపై కంప్లైంట్‌ ఇవ్వమన్నారు. నాగరాజుపై నేను ఫిర్యాదు చేశాను. నా భార్య చనిపోయి ఆరు నెలలైనా ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. మా ఇద్దరి పిల్లలకు న్యాయం చేయండి. నా భార్య చావుకి కారణమైన వారిని శిక్షించండి’’ అని నాగమణి భర్త నాగరాజు లేఖలో రాశాడు. కానిస్టేబుల్‌ నాగమణి చనిపోయిన ఆరు నెలలకు ఆమె భర్త నాగరాజు పోలీసు చీఫ్‌కు లేఖ రాసి ఆత్మహత్యకు యత్నించడం విజయవాడలో సంచలనం కలిగించింది.
 
ఇది పోలీసు శాఖలో కలకలం రేపింది. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగరాజును ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వాసు పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం à°“ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి నాగమణి, కానిస్టేబుల్‌ నాగరాజు ఒకే బ్యాచ్‌కు చెందిన వారని సమాచారం.