గాడిద పాలకు భలే గిరాకీ

Published: Thursday September 06, 2018
గంగిగోవుపాలు గరెటడైన చాలు.. కడవడైతెనేమి ఖరము పాలు అని వేమన గాడిద పాలను తృణీకరించారు గానీ గాడిద పాలకు ఉన్న గిరాకీ తెలిస్తే à°† మాట అనాలనిపించదు. ప్రస్తుతం గోవుపాలు లీటరు రూ.50 లభిస్తుండగా, గాడిద పాలు ధర మాత్రం ఏకంగా లీటరు రూ.2000 పలుకుతుంది. శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గాడిదను తీసుకువచ్చి చిన్న సీసా (50 ఎంఎల్‌) రూ.100 జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. గాడిదపాలు సేవిస్తే వ్యాధి నిరోదకశక్తి పెరుగుతుందని, మంచి బలం వస్తుందని, ఉబ్బసం, నెమ్ము వంటి వ్యాధులు నయమవుతాయని తెలుపుతూ గాడిదపాల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. అనేక మంది చిన్నారుల కోసం, వృద్ధుల కోసం విరివిగా గాడిదపాలు ఖరీదైనప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.
 
 
చరుగ్మతలు నయం కావు
గాడిదపాలు సేవించడం ద్వారా ప్రత్యేకమైన వ్యాధి నిరోధకశక్తి పెంపొందటం కాని, ఆ పాల ద్వారా ఉబ్బసం, నెమ్ము వంటివి తగ్గేది ఉండదు. ఈ పాలల్లో ఉండే పోషకాలు ఈ పాలల్లోనూ ఉంటాయి.