ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

Published: Friday September 07, 2018

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు పురుగుల మందుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రియురాలు మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రియుడిని బంధువులు మదిరకు తరలించారు. వేర్వేరు సామాజికి వర్గానికి చెందిన వారు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు