జగన్‌పై మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైర్‌

Published: Saturday September 08, 2018
‘మీ తల్లి విజయలక్ష్మిని à°“à°¡à°¿à°‚à°šà°¿à°¨ బీజేపీతో మీరు కలవొచ్చు.. అలాంటప్పుడు మేం టీడీపీలో కలిస్తే తప్పేముంది’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను నిలదీశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయుంట్‌లో సహచర మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని, అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పినా జగన్‌ వినలేదని.. ప్రభుత్వం చేసే ఏ పనినైనా వ్యతిరేకించాల్సిందేననేవారని..ఆయన తీరు నచ్చకే వైసీపీ నుంచి బయటకు వచ్చానని మంత్రి చెప్పారు. ‘తన వల్లే మేం గెలిచామని జగన్‌ చెబుతున్నారు. విశాఖలో ఆయన తల్లి విజయలక్ష్మి తన వల్లే ఓడిపోయిందని జగన్‌ ఒప్పుకొంటే.. మేం కూడా జగన్‌ వల్లే గెలిచామని అంగీకరిస్తాం. ఆయన మా వంశ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. వైసీపీ పెట్టిన నాటి చరిత్ర చెబితే జగన్‌ పారిపోతారు’ అని తెలిపారు.
 
 
       à°ªà°¾à°°à±à°Ÿà±€ మారినందుకు తనకు రూ.20 కోట్లు ఇచ్చారని జగన్‌ విమర్శలు చేస్తున్నారని.. వైసీపీలో చేరినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. తమను à°Šà°° పందులంటున్న జగనే à°Šà°° పంది అని విమర్శించారు. ‘జగన్‌ పార్టీ పెట్టినప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం నుంచి 31 మంది ఎమ్మెల్యేలం వైసీపీలో చేరాం. పార్టీ మారిన రోజే మా రాజీనామాలు ఎందుకు కోరలేదు? ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే.. తనను మినహాయించి.. మిగతా వారంతా మా టీంలో కలిసిపోతారేమోనని జగన్‌ భయపడుతున్నారు. పిల్లాడు పాలడబ్బా కోసం పాకులాడినట్లు సీఎం సీటు కోసం పాకులాడుతున్నారు. మీ తల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోతే, ఏ విధంగా à°† పార్టీతో కలుస్తారని మేమడిగితే సమాధానం చెప్పలేదు. మా ప్రాంత అభివృ ద్ధి కోసమే టీడీపీలో చేరాం’ అని స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి అనేక తప్పులు చేశారన్నారు. à°Žà°‚à°¤ అరచినా సీఎం కాలేరన్నారు. కేరళలోని పద్మనాభస్వామి వద్ద à°Žà°‚à°¤ డబ్బుందో జగన్‌ దగ్గరా à°…à°‚à°¤ డబ్బుందని వ్యాఖ్యానించారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. చరిత్రలో తొలిసారి à°•à°¡à°ª జిల్లాలో వైసీపీకి పరాభవం ఎదురైందన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా సీఎం కావాలనుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ సీఎం కాలేరని ఆదినారాయణరెడ్డి తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తమను ఓడిస్తామంటున్న జగన్‌కు దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయాలని మంత్రి అమరనాథ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తమ సత్తా, ఆయన సత్తా ఏంటో తేల్చుకుంటామని చెప్పారు. ‘నువ్వు(జగన్‌) పుట్టక ముందే మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే à°—à°¾ చేశారు. మాది రాజకీయ కుటుంబం. నీ బొమ్మ పెట్టుకుని గెలవాల్సిన దుస్థితి మాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. బీటెక్‌ రవి మాట్లాడుతూ.. ‘మీ బాబాయి వివేకానందరెడ్డిపై నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు టీడీపీలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలను తీసుకెళ్లి.. వైసీపీ జెండాలు కట్టించుకుని, ఓట్లేయించుకున్నప్పుడు ఏమైంది నైతికత? అప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి గుర్తుకు రాలేదా’ అని ప్రశ్నించారు.