నిరుద్యోగ భృతి సంఖ్యపై పరిమితి లేదు

Published: Monday September 10, 2018
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. భృతి ఇవ్వాల్సిన నిరుద్యోగుల సంఖ్య 12 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ.. సంఖ్యపై ఎలాంటి పరిమితీ పెట్టడం లేదు. à°Žà°‚à°¤ మంది అర్హులు ఉంటే à°…à°‚à°¤ మందికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ 20 వేల మందికి మించి భృతి ఇవ్వలేదు. ఇచ్చిన రాష్ట్రాల్లోనూ రూ.100 నుంచి రూ.500 వరకే ఇచ్చారు. అది కూడా సరిగా చెల్లించలేకపోయారు. పలు రాష్ట్రాల్లో à°ˆ పథకం విఫలమైంది. కానీ నవ్యాంధ్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 12 లక్షల మందికి నెలకు రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు అవసరమైన కసరత్తు పూర్తయింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇది అందనుం ది. అంతేకాదు.. నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాల కల్పనకు ప్రభు త్వం తోడ్పాటు అందించనుంది. ఇందుకోసం దేశంలోని పలు పేరున్న పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కూడా తగిన శిక్షణా ఇస్తారు. à°ˆ నెల 14à°µ తేదీన à°ˆ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నాడు యువత బ్యాంకు ఖాతాలకు నేరుగా తొలి భృతి జమచేస్తారు.
 
సంక్లిష్టమే అయినా.. పక్కాగా
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుద్యోగ భృతి పథకాలు ప్రవేశపెట్టారు. నెలకు రూ.100 నుంచి రూ.500 వరకే ఇచ్చారు. ఏ రాష్ట్రంలోను 20 వేల మందికి మించి భృతి ఇవ్వలేదని.. అది కూడా విఫలమైందని రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. కొన్ని రాష్ట్రాల్లో à°ˆ పథకంలో అర్హులు కానివారు తీవ్ర అసంతృప్తి, అలజడికి కూడా లోనయ్యారు. కేవలం వేల మందికి ఇచ్చిన చోటే ఇలాంటి పరిస్థితి ఉంటే.. 12 లక్షల మందికి చెల్లించే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం, వాటిని పరిశీలించడం, ఆమోదించడం, నెలనెలా వారికి భృతి పంపిణీ చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే మంత్రి లోకేశ్‌ దీనిపై నెలల తరబడి కసరత్తు చేశారు.
 
నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న ఆయన à°ˆ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపించారు. భృతి ఒక్కటే కాకుండా.. à°ˆ పథకాన్ని ఉద్యోగాల కల్పనకూ ఎలా ఉపయోగపడేలా చేయాలన్న దానిపై పెద్ద కసరత్తే నిర్వహించారు. దేశంలోని వివిధ కంపెనీల్లో ఉన్న ఉద్యోగాలకు.. ఆయా నిరుద్యోగులను అర్హులుగా మలిచేలా à°ˆ పథకానికి రూపకల్పన చేశారు. భృతి, శిక్షణ, అప్రెంటి్‌సషిప్‌, ఉద్యోగావకాశాలు... ఇలా à°ˆ పథకాన్ని అవకాశాల గనిగా మార్చేందుకు అవసరమైన వెబ్‌సైట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ని లక్షల మంది ఉన్నా సాఫీగా దరఖాస్తు చేసుకోవడం.. ఆన్‌లైన్‌లోనే పరిశీలన.. అర్హులో కాదో చెప్పేయడం.. ఫిర్యాదులుంటే దానికీ అక్కడే అవకాశం ఉండేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి సంబంధించి à°—à°¤ రెండు నెలల్లోనే 36 సమీక్ష సమావేశాలను లోకేశ్‌ నిర్వహించారు.