విద్యార్థులపై ఓ ప్రిన్సిపాల్‌ కర్కశం

Published: Tuesday September 11, 2018
నెల్లూరు: à°µà°¿à°¦à±à°¯à°¾à°¬à±à°¦à±à°§à±à°²à± నేర్పించాల్సిన గురువే సహనం కోల్పోయాడు. ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కొట్టడమే కాదు.. వారిచేత సొంత పనులు చేయించుకుంటున్నాడు. ఆయన వ్యవహారం బయటకు పొక్కడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు సోమవారం కలెక్టర్స్‌, ఎస్పీ గ్రీవెన్స్‌లలో ఫిర్యాదు చేశారు. దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రాంగణంలోని గిరిజన ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల, హాస్టల్‌ ప్రిన్సిపాల్‌ వెంకటరమణ పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని శారీరకంగా హింసిస్తున్నాడంటూ à°† సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు పేర్కొన్నారు. విద్యార్థులను బట్టలు ఊడదీసి కొట్టడం, తలను గోడకు వేసి కొట్టడం, విద్యార్థులను కాళ్లతో తన్నడం ఇలా శారీరకంగా హింసిస్తున్నాడని మండిపడ్డారు. దీంతోపాటు తల్లిదండ్రులను బూతులు తిట్టడం, హాస్టల్లో పిల్లల చేత పనులు చేయించడమే కాకుండా సొంత పనులు కూడా చేయిస్తున్నాడని ఆరోపించారు. యానది జాతి పిల్లలు విద్యకు దూరమవతున్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రిన్సిపాళ్లు ఉంటే భయబ్రాంతులకు గురై పిల్లలు పాఠశాలకు రావడం మానేస్తున్నారని ఆవేదన చెందారు. విద్యార్థులను హింసిస్తున్నట్లు వీడియో ఫుటేజీలు, చిత్రాలను సమాఖ్య సభ్యులు ఆంధ్రజ్యోతికి అందించారు.
గ్రీవెన్స్‌లో అందిన ఫిర్యాదుపై ఆంధ్రజ్యోతి హాస్టల్‌ పిల్లలను à°…à°¡à°¿à°—à°¿ విషయం తెలుసుకొనేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లు లేరని వారు వచ్చాక మాట్లాడాలని సిబ్బంది సూచించారు. దీంతో కనీసం ఫోన్‌లో మాట్లాడతామని కోరగా సిబ్బంది వార్డెన్‌కు ఫోన్‌ కలిపారు. ఫోన్‌లో సార్‌ అది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు వాటి గురించి ఎందుకు? మీకు ఏం కావాలో చెప్పండి విషయం బయటకు రానివ్వకుండా అని బేరాలకు దిగారు.
క్రమశిక్షణలో పెట్టేందుకే పిల్లలపై చేయి చేసుకున్నా. అంతేతప్ప పిల్లలను హింసించలేదు.