ఇంట్లో నుంచే దరఖాస్తులు.. యువనేస్తం వెబ్‌సైట్‌పై లోకేశ్‌

Published: Wednesday September 12, 2018

ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ను 14à°µ తేదీన ప్రారంభిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌ తెలిపారు. నిరుద్యోగులు à°ˆ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంగళవారం మండలిలో తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు సమయంలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు నేరుగా 1100కు వెళ్తుందని తెలిపారు. à°† సమస్యను తక్షణమే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి 2705 పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. యువనేస్తం వెబ్‌సైట్‌లో నిరుద్యోగుల ప్రొఫైల్స్‌ సిద్ధంగా ఉంటాయని, పరిశ్రమల అవసరాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా మేనిఫెస్టోలో పెట్టిన హామీల కంటే ఎక్కువే అమలు చేశామన్నారు.