దోమలపై కాదు.. బీజేపీపై దండయాత్రలోనే సీఎం సఫలం

Published: Wednesday September 12, 2018
 ‘సీజనల్‌ వ్యాధుల నియంత్రణ ఘోరంగా ఉంది. దోమలపై దండయాత్ర ఘోరంగా విఫలమైంది. à°ˆ విషయంలో సీఎం చంద్రబాబు కూడా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బురద చల్లడంలోనే చంద్రబాబు విజయం సాధించారు. డెంగీ, మలేరియా, విషజ్వరాలను నియంత్రించడంలో విఫలమయ్యారు.’ అంటూ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మంగ ళవారం శాసనసభలో సీజనల్‌ వ్యాధులపై జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖలోని కేజీహెచ్‌లో ఒకే బెడ్‌పై ఇద్దరు, à°•à°¿à°‚à°¦ ఇద్దరు పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారని, వెంటనే సదుపాయాలు పెంచాలని కోరారు. మరోసారి దోమలపై దండయాత్ర చేపట్టాలని సూచించారు. విష్ణుకుమార్‌ రాజు విమర్శలపై మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
‘ప్రభుత్వం చేపట్టిన యుద్ధం విఫలమయ్యిందని.. à°† యుద్ధం నుంచి తప్పించుకొన్న దోమలు వచ్చి మీకు చెప్పాయా?. యుద్ధం నుంచి ఎన్ని దోమలు తప్పించుకుని వచ్చాయో మీరు లెక్కపెట్టారా?’ అని ప్రశ్నించారు. దోమలు, పారిశుధ్యం నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు. దోమలపై యుద్ధం విజయవంతమయ్యిందని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రంలో డెంగీ, మలేరియా, జ్వరాల కేసులు చాలామేరకు తగ్గాయని అన్నారు. ప్రభుత్వ రంగంలో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత ఉందని మంత్రి అంగీకరించారు. స్పెషలిస్టులకు ఎక్కువ వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.