వినాయక విగ్రహం వద్ద విద్యుత్‌ షాక్‌.

Published: Saturday September 15, 2018
రామాపురం మండలం కేంద్రానికి చెందిన అయోద్యాపురం రాజారెడ్డికి కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల చదువుల కోసమే ఆయన తన కాపురాన్ని రాయచోటి పట్టణానికి మార్చాడు. కొడుకు ప్రే మకుమార్‌రెడ్డి మదనపల్లె మిట్స్‌ కాలేజ్‌లో బి టెక్‌ ప్రఽథమ సంవత్సరం చదువుతున్నాడు. వినాయక చవితి పండుగ కావడంతో.. స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఇంటికి వచ్చా డు. కొత్తపేట చలపతి వీధికి ఎదురుగా ఉన్న వీధిలో ఇతని ఇంటికి ఎదురుగా వినాయక వి గ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద లై ట్లు. ఇతరా అవసరాల కోసం కరెంటు కనెక్షన్‌ తీశారు. à°† కరెంటు బాక్సులు కిందనే ఉన్నా యి. గురువారం 9 à°—à°‚à°Ÿà°² సమయంలో ఇక్క à°¡ హాజరైన భక్తులనుద్దేశించి.. మృతుడు మై కులో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో.. మైకుకు ఒకసారిగా కరెంటు ప్రవహించింది. దీంతో ప్రేమకుమార్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
 
వెంటనే పక్కన ఉన్న వాళ్లు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు. à°ˆ సంఘటన రాయచోటి పట్టణంలో కలకలం రేపింది. క్షణాల్లో పట్టణమంతా వ్యాపించింది. విగ్రహాల వద్ద క్షణక్షణం అప్రమత్తంగా లేకపోతే.. ఇటువంటి దుర్గటనలే జరుగుతాయని సిఐ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆయన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలే దు. మృతుని తండ్రి రాజకీయంగా కొంచెం చురుకుగా ఉండడంతో.. అతని పరిచయస్థులు, బంధువులు, మృతుని స్నేహితులు పెద్ద సంఖ్యలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం రామాపురం మండల కేం ద్రంలో మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏది ఏమైనా à°ˆ సంఘటన రాయచోటి పట్టణంలో సంచలనం రేపింది.