శ్రీనివాస్‌ రెడ్డి పేరుతో మరో వ్యక్తి ....

Published: Tuesday September 18, 2018
 à°¤à°¨ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి, సినిమా కథలు చెప్పాలని, సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చాటింగ్‌ చేస్తూ పలువురు మోసం చేస్తున్నారని, దాని వల్ల ఇండస్ట్రీలో తనకు చెడ్డ పేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని సినీ కథానాయకుడు, కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట ప్రాంతంలోని à°“ బస్తీకి చెందిన రవికిరణ్‌ గతంలో కొన్నాళ్లపాటు పలువురు ఆర్టిస్టుల à°•à°¿à°‚à°¦ అసిస్టెంట్‌à°—à°¾ పనిచేశాడు. à°† పరిచయాలను అడ్డంపెట్టుకొని నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలను సృష్టించేవాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, మంచి కథలు ఉంటే పంపాలని పలువురితో చాటింగ్‌ చేస్తున్నాడు. à°ˆ క్రమంలో జయంబు.. నిశ్చయంబు, గీతాంజలి సినిమాల కథానాయకుడు శ్రీనివాస్‌రెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించాడు.
 
    దాని ద్వారా అనేక మంది నెటిజన్లతో చాటింగ్‌లు చేయడం, సినిమా కథలు, అవకాశాలు ఇప్పిస్తానని పలువుతరితో చెప్పడం చేస్తున్నాడు. దాంతో కొందరు అతను నిజంగానే శ్రీనివాస్‌ రెడ్డిగా భావించి అనేక విషయాలను షేర్‌ చేసుకున్నారు. à°ˆ విషయం ఆర్టిస్టు శ్రీనివాస్‌ రెడ్డికి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. ఎవరో కావాలని తనపేరును వాడుకుంటున్నారని, తనకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నిందితుడు రవికిరణ్‌à°—à°¾ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపారు.