సమష్టి కృషితోనే రాష్ట్రానికి అవార్డుల పంట

Published: Friday September 21, 2018
చేసే పనిలో మరింత నిమగ్నమై, ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి శ్రద్ధతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొందరు తహశీల్దార్లతో కూడా మాట్లాడారు. ‘మనందరిదీ à°’à°• బృందం. నేను బృందానికి నాయకుడిని మాత్రమే. ప్రపంచానికే మనదొక నమూనా కావాలి. గతంలో అధికారులను తిడితే జనం చప్పట్లు కొట్టేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పనిచేసే అధికారిని పొగిడితే చప్పట్లు మార్మోగిపోతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ మారిన యంత్రాంగం పనితీరుకు ఇదే నిదర్శనం. à°ˆ ప్రభుత్వంలో అధికారులకు గౌరవం పెరిగింది. నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. à°ˆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి’ అని à°ˆ సందర్భంగా అన్నారు. అనేక ప్రామాణికాల్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. సమష్టిగా పనిచేయడం వల్లే అనేక విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
 
మారిన గ్రామీణ ముఖచిత్రం
‘à°’à°• విజన్‌తో కసిగా పనిచేయడం వల్ల నాలుగేళ్లలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రాన్ని మార్చివేయగలిగాం. 2014à°•à°¿ ముందు ఏ గ్రామంలో కూడా కనీస వసతులు లేవు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేశాం. పచ్చదనం వెల్లివిరుస్తోంది. వీధిదీపాలు వెలుగుతున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలో అగ్రగామిగా ఉన్నాం. పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయి పూటగడిచే దారి లేక కష్టాల సుడిగుండంలో పడిపోయే కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం గొప్ప భరోసా ఇచ్చింది.’
 
అవార్డుల పంట
గతంలో పంచాయతీరాజ్‌ శాఖకు 17 అవార్డులు వచ్చాయి. ఇప్పుడు గృహనిర్మాణ శాఖకు 15, ఇంధన శాఖకు 10 అవార్డులు దక్కాయి. à°—à°¤ నాలుగేళ్లలో 550à°•à°¿ పైగా పురస్కారాలు వరించాయి. అవార్డులతోనే సంతృప్తి చెందకుండా, మరింత సామర్థ్యంతో పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి వీటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. గ్రామదర్శినికి ఒకసారి వెళ్తేనే 3 శాతం సంతృప్తి పెరిగింది. రెండు మూడు పర్యాయాలు పల్లెలను సందర్శిస్తే 10 శాతానికి పైగా సంతృప్తి సాధించవచ్చు.’