ఆ పనీ ఈ పనీ అన్న తేడా లేదు

Published: Friday September 21, 2018
రాజధాని పనుల్లో నేతల గిల్లుడు రకరకాలుగా ఉంటోంది. కొందరు ఏకంగా పనిలో భాగస్వామ్యం డిమాండ్‌ చేస్తుండగా... మరికొందరు ‘పర్సెంటేజీ’ ఫిక్స్‌ చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలిద్దరూ కలిసిపోయి మరీ దందా సాగిస్తున్నారు. ఒకవేళ ఏ కాంట్రాక్టరైనా తాము అడిగినంత సొమ్ము ముట్టజెప్పకపోతే పనులకు ఆటంకాలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం, తమ అనుచరులతో గొడవలు చేయించడం వంటి చర్యలకూ దిగుతున్నారు. గతంలో చెరువును ఆక్రమించి, దానిని భూ సమీకరణలో తన భూమిగా అప్పగించి అప్పనంగా ప్లాటు పొందినట్లు ఆరోపణలున్న à°’à°• సీనియర్‌ నేత... రాజధాని పనుల విషయంలోనూ చెలరేగిపోతున్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా నిర్మిస్తున్న à°’à°• రహదారిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ తనకు ముడుపులివ్వలేదన్న అక్కసుతో కొంతకాలంపాటు పనులు అడ్డుకున్నారు.
 
‘నిర్మాణ ప్రమాణాలు పాటించనందున, ప్రజా శ్రేయస్సును కోరి పనులను ఆపివేయించాను. à°† లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించనందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ పైకి బిల్డప్‌ ఇచ్చారు. à°† తర్వాత కొన్నాళ్లకు పనులు పునఃప్రారంభమయ్యాయి. à°ˆ నేతాశ్రీ లేవనెత్తిన ‘లోపాలు’ సరి చేశారో, లేదో తెలియదుగానీ ఆయనకు మాత్రం బాగానే ‘గిట్టుబాటు’ అయిందని సమాచారం! స్థాయిని బట్టి కొందరు నాయకులు భారీ ప్రాజెక్టులపైనే దృష్టిని కేంద్రీకరిస్తుండగా... మరికొందరు గ్రామాల్లోని పాఠశాలలు, ఇతర చిన్న చిన్న పనుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
 
ఇది మరో రకం దందా...
రాజధానిలోని ఎల్పీఎస్‌ జోన్లను పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి చేయాలని సీఆర్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్లు పిలిచి పనులను ఖరారు చేసింది. అయితే, కొన్ని గ్రామాలకు చెందిన నాయకులు à°ˆ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లను రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు కమీషన్‌లు పుచ్చుకుంటుండగా... మరికొందరు తమ అనుచర గణానికి చెందిన వారి ట్రాక్టర్లు, ఇతర యంత్రసామగ్రినే ఉపయోగించాలని ఒత్తిడి తెచ్చి సాధిస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా... వాటికి చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా నేతలే నిర్ణయిస్తున్నారు.
 
‘అక్రమానికి’ à°…à°‚à°¡...
రాజధాని గ్రామాల్లో అమరావతితో సరిసమానంగా మౌలిక వసతులను కల్పించి, వాటిని కూడా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సీఆర్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా భవన నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు విధించింది. వీటిని కూడా నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ‘‘ఎలా కట్టుకున్నా ఫర్లేదు. సీఆర్డీయే అధికారులు మీ భవనం జోలికి రాకుండా చూస్తాం’’ అని భరోసా ఇస్తున్నారు. నిర్మాణదారుల నుంచి ఎంతోకొంత రాబడుతున్నారు.
 
దీంతో పలు గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో ఆయా గ్రామాల్లో పలు సమస్యలకు దారి తీయడంతోపాటు అమరావతి రూపురేఖలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వాపోతున్నారు. ఇక... రాజధానిలో కృష్ణానదీ తీరాన ఉన్న ఇసుక రేవులనూ వివిధ గ్రామాలకు చెందిన కొందరు నేతలు గుట్టుచప్పుడు గుప్పిట పట్టారు. వీరి అండతో రీచ్‌à°² వద్ద సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విసిగిపోయిన కొన్ని గ్రామాల ప్రజలు తిరగబడ్డారు కూడా!