మోదీ అంటే వారికి భయం

Published: Sunday September 23, 2018
నవ్యాంధ్ర పట్ల కేంద్రానిది వివక్ష, విపక్ష వైసీపీది నిర్లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయకుండా, హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. చట్ట సభలకు రావాలని ప్రజలు ఓటు వేస్తే విపక్ష వైసీపీ అసెంబ్లీకి రాకుండా బీజేపీతో లాలూచీ పడిందని మండిపడ్డారు. మోదీకి భయపడి బీజేపీకి à°Šà°¡à°¿à°—à°‚ చేస్తోందని విమర్శించారు. శనివారం కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. à°•à°¡à°ª, కర్నూలు జిల్లాలకు మేలు చేసే సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. అవుకు జలాశయం నుంచి గండికోటకు నీటిని విడుదల చేశారు. గోరుకల్లు రిజర్వాయర్‌లో పది టీఎంసీల నీటి నిల్వను ప్రారంభించారు. పులికనుమ, ఇస్కాల ఎత్తిపోతల పైలాన్‌లను ఆవిష్కరించారు. కొలిమిగుండ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీజేపీ, వైసీపీలపై విరుచుకుపడ్డారు. ‘‘వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇది న్యాయమా? పని చేయకపోతే కూలీ డబ్బు ఇస్తారా?’’ అని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై తాను పోరాడుతుండగా... వైసీపీ మాత్రం మోదీకి సహకరిస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందన్నారు. ‘‘నన్ను విమర్శిస్తారు.. మోదీని మాత్రం విమర్శించరు. à°ˆ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ అని తెలిపారు.
 
మాది పోరాటం... వారిది ద్రోహం
బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని టీడీపీ ఎనిమిదేళ్ల క్రితం పోరాటం చేస్తే ఇప్పుడు నోటీసులు పంపించారని, ఇదెక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘నీతీ నిజాయితీగా ఉన్నాను. నిప్పులాగా బతికాను. నన్ను ఎవరైనా ఏదైనా చేస్తే అవి వారికే శాపాలుగా మారుతున్నాయి! నాది ప్రజా పోరాటం. మీది నమ్మక ద్రోహం’’ అని వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్రం కోసం చేసే పోరాటంలో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని, నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. దేశంలో లేనివిధంగా పేదలకు 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక ప్రభుత్వం టీడీపీయేనన్నారు. à°—à°¤ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో 14 లక్షల దొంగ పేర్లు రాసి రూ.4వేల కోట్లు స్వాహా చేసిందన్నారు.
 
ఐదు లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు
రైతు సంక్షేమం కోనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేస్థాయికి చేరుకుందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించాలంటూ తనకు ఆహ్వానం అందిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం పెంచేందుకు సహకరిస్తామని ఐరాస హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో à°ˆ ఏడాది 5 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారన్నారు. నీటి వనరులను కాపాడుకునేందుకు, ప్రకృతిని కాపాడుకునేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఘనత టీటీపీ ప్రభుత్వానిదేనన్నారు.
 
అవినీతి లేని పాలన...
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తమతమ పనుల కోసం ఆఫీసులకు వెళ్లే పని లేకుండా ఫోన్‌ యాప్‌ ద్వారా అన్ని పౌరసేవలను అందుబాటులోకి తెచ్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. à°ˆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమా, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, శాసనమండలి చైర్మన్‌ ఫరూక్‌, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, టీజీ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.