రామగఢ్‌ ఘటనపై రగులుతున్న నక్సల్స్‌

Published: Monday September 24, 2018
రామగఢ్‌ ఎన్‌కౌంటర్‌తో కకావికలమైన సీపీఐ మావోయిస్టు పార్టీ.. రెండేళ్లుగా ప్రతీకారంతో రగిలిపోతోంది. అతలాకుతలమైన పార్టీని పునర్నిర్మించుకుంటూనే.. విశాఖ ఏజెన్సీపై ప్రత్యేక దృష్టిసారించి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ వచ్చింది. 2016 అక్టోబరు 24à°¨ ఆంధ్ర-ఒడిశా(ఏవోబీ సరిహద్దు ప్రాంతంలోని రామగఢ్‌ అటవీ ప్రాంతంలో ఇరువర్గాల నడుమ జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో అపార అనుభవం కలిగిన పార్టీ నేతగణేశ్‌ అలియాస్‌ బాకూరు వెంకటరమణతోపాటు ఎనిమిది మంది అగ్రనేతలు, సుమారు 22 మంది దళసభ్యులు (30 మంది) మృతిచెందారు.
 
à°ˆ ఘటన మావోయిస్టు పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పోలీసు అధికారులు ఇక మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణం సాధ్యం కాదని భావించారు. à°† పార్టీ కూడా à°°à°¾ మగఢ్‌ ఘటనలో తమ వైఫల్యం ఉందని, పార్టీ సభ్యులందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులు మెరుపుదాడి చేయడం వల్ల ప్రతిఘటించలేకపోయామని ఏవోబీలో నిర్వహించిన ప్లీనరీలో అభిప్రాయపడినట్లు సమాచారం. రామగఢ్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని తీర్మానించుకుని.. తొలుత 8 నెలలపాటు స్తబ్ధుగా ఉండిపోయింది.
 
ఎట్టకేలకు పార్టీ పునర్నిర్మాణానికి 2017 అక్టోబరు 21à°¨(సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినం) మావోయిస్టులు శ్రీకారం చుట్టారు. ఏవోబీలో ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ కేడర్‌తో కార్యకలాపాలను పెంచారు. ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఛత్తీ్‌సగఢ్‌లో 260 మంది(16 నుంచి 25 ఏళ్లలోపు) యువతీ యువకులకు సాయుధ పోరులో అగ్రనేతలు శిక్షణిచ్చారు. ఇందులో పాల్గొన్న యువకుల్లో దాదాపు 60ు మంది ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రానికి చెందినవారు. 25ు మంది ఒడిసావాసులు. కేవలం 15ు మంది మాత్రమే విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల కు చెందిన యువకులున్నారు. శిక్షణ పొందిన వారిలో 50 శాతానికిపైగా మహిళలే. à°ˆ శిక్షణకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను అప్పట్లో పార్టీయే స్వయంగా మీడియాకు చేరవేసింది. వీరితో à°† పార్టీ 20 దళాలను ఏర్పాటుచేసినట్లు సమాచారం. ఒక్కొక్క దళంలో 9 నుంచి 12 మందిని సభ్యులుగా నియమించింది.
 
తూర్పు కనుమల స్థానంలో ఎంకేవీబీ
ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో గతంలో తూర్పుకనుమలు, కొరాపుట్‌, మల్కన్‌à°—à°¿à°°à°¿, ఛత్తీ్‌సగఢ్‌లకు వేర్వేరుగా మావోయిస్టు పార్టీ విభాగాలు ఉండేవి. రామగఢ్‌ ఎదురుకాల్పుల అనంత à°°à°‚ అగ్రనేతల సంఖ్య తగ్గిపోవడంతో.. పార్టీ పటిష్ఠానికి, పా లనా సౌలభ్యానికి ఎంకేవీబీ(మల్కన్‌à°—à°¿à°°à°¿, కొరాపుట్‌, విశాఖ బోర్డర్‌)ని ప్రత్యేక డివిజన్‌à°—à°¾ ఏర్పాటుచేసింది. à°ˆ డివిజన్‌కు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు ప్రతా్‌పరెడ్డి అలియాస్‌ అప్పారావు అలియాస్‌ చలపతి ఎంకేవీబీకి ముఖ్య సలహాదారు. గతంలో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కృష్ణ ప్రస్తుతం టెక్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రచారం. ఏడాది కిందట ఛత్తీ్‌సగఢ్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక దళాలు చలపతి ఆధ్వర్యంలోనే గెరిల్లా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కండ్రూంలో గ్రామదర్శినికి వెళ్తున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమెల్యే సివేరి సోమలను ఆదివారం హత్యచేసింది గెరిల్లా దళాలేనని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.
 
పక్కా ఎత్తుగడలతోనే..
గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలకు సారథ్యం వహిస్తున్న నవీన్‌ 2 నెలలుగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని జీకే వీధి, కొయ్యూరు సరిహద్దు ప్రాంతాల్లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గిరిజనులతో సమావేశాలు నిర్వహి స్తూ, తమ కదలికలు పోలీసులకు తెలిసే ఎత్తుగడ వేశారు. తమ కదలికలు పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో మావోయిస్టుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పోలీసు ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో నామమాత్రంగా కూంబింగ్‌ చేపడుతున్నాయి. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ.. à°ˆ ప్రాంతంలో కేవలం ప్రకటనలు విడుదల చేయడం, వాల్‌ పో స్టర్లు అతికించడం, ప్రజా ప్రతినిధులకు లేఖలతో హెచ్చరికలు చేయడం వరకే పరిమితమైంది.
 
అడపా దడపా ఇన్‌ఫార్మర్ల నెపంతో సామాన్య గిరిజనులపై దాడులు చేసినా అవి à°…à°‚à°¤ తీవ్రమైనవి కాకపోవడంతో పోలీసులు సైతం ఆదమరిచారు. ఇదే అదనుగా మావోయిస్టులు సానుభూతిపరులను పెంచుకునే ప్రయత్నం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సర్వేశ్వరరా వు హత్యకు వ్యూహం రచించారు. ఆయన కదలికలను తెలుసుకుంటూ పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు సమాచారం. మైనింగ్‌కు వ్యతిరేకంగా గూడ ప్రాంతంలో గిరిజనులు టెంట్లువేసి నిరసనకు దిగారు. à°“ రోజు అర్ధరాత్రి à°† టెంట్లు కాలిపోయాయి. అందుకు ఎమ్మెల్యే కిడారి కారణమని కోపం పెంచుకున్నారు. తమ వ్యూహానికి ఇదే మంచి అవకాశం అనుకున్న మావోయిస్టులు ఒక్కసారిగా ఊహించని దాడికి తెగబడ్డారు.