నక్సల్స్‌కు సత్తా చూపిస్తాం.. దర్యాప్తులో ఏ కోణమూ వదలం

Published: Thursday September 27, 2018
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసినవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘‘రామ్‌గూడ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీగా నష్టపోయారు. దానికి ప్రతీకారంగా రెండేళ్లుగా పోలీసులపై దాడులకు యత్నించినా తిప్పికొట్టాం. దీంతో ఎప్పటినుంచో దాడుల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ఉనికిని చాటుకోవడానికే à°ˆ దుశ్చర్యకు పాల్పడ్డారు’’ అని మండిపడ్డారు. వారికి ఇకపై తమ సత్తా చూపిస్తామన్నారు. అమెరికా పర్యటన నుంచి బుఽధవారం తిరిగి వచ్చిన ఠాకూర్‌, à°† వెంటనే విశాఖకు చేరుకున్నారు.
 
లివిటిపుట్టు ప్రాంతాన్ని తొలుత సందర్శించారు. అక్కడినుంచి అరకు, పాడేరు చేరుకొని, బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయి.. మావోయిస్టుల ఆటలు కట్టించే వ్యూహాలపై కీలక సమాలోచనలు జరిపారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతి భద్రతల ఏడీజీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్‌, జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, ‘సిట్‌’ అధికారి ఫక్కీరప్ప తదితరులతో సమీక్షించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘అసలేం జరిగింది..? అంతమంది వచ్చినా మనం గుర్తించలేక పోవడమేంటి.? మనం ఎక్కడ విఫలమయ్యాం?’ అంటూ డీజీపీ వరుస ప్రశ్నలతో పోలీసు ఉన్నతాధికారులను ఉక్కిరి బిక్కిరి చేశారు.
 
ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నామని మండిపడ్డారు. à°“ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతోంటే, స్థానిక పోలీసులు హిట్‌లి్‌స్టలో ఉన్న ఎమ్మెల్యే రక్షణ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారని ఆగ్రహించారు. ‘‘దేశంలోని మొత్తం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోనే మన గ్రేహౌండ్స్‌ నంబర్‌వన్‌à°—à°¾ ఉంది. మన ఎస్‌ఐబీ సైతం బలంగా ఉంది.. అయినా 60మంది మావోయిస్టులను గుర్తించలేక పోయాం. à°’à°• రోజు ముందుగానే మన ప్రాంతంలోకి వచ్చి గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చిలో కొన్ని గంటలపాటు మావోయిస్టులు నక్కినా మనకు తెలియకపోవడం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న వారికి ట్రైనింగ్‌ ఎక్కడ ఇచ్చారని అడగ్గా, అలాంటిదేమీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు బదులిచ్చారు. కిడారి, సోమలకు రక్షణగా వెళ్లిన గన్‌మెన్‌ ఏకే 47 లాంటివి తీసుకెళ్లకుండా రివాల్వర్లు, కార్బన్‌ మాత్రమే తీసుకెళ్లడమేంటని ఠాకూర్‌ సీరియస్‌ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కావడానికి వీల్లేదని, చాలా సీరియ్‌సగా యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించారు. వీలయినంత త్వరలోనే గట్టిగా బుద్ధి చెప్పి తీరాలని నిర్దేశించారు. కిడారి, సివేరి హత్యలపై నిజానిజాలు వెలికితీస్తోన్న విశాఖ డీసీపీ ఫక్కీరప్ప నేతృత్వంలోని ‘సిట్‌’ బృందంతో డీజీపీ ప్రత్యేకంగా మాట్లాడారు. నేతలు బయలుదేరినప్పటి నుంచి à°ˆ నిమిషం వరకూ ఏమి జరిగిందనేది à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకొన్నారు. వెనుక కారులో వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ వీడియోలు డీజీపీకి చూపుతూ, ఘటనపై ఫక్కీరప్ప వివరించారు.
 
లివిటిపుట్టులో యువకులు మాయం?
లివిటిపుట్టు గ్రామంలో మరోసారి అలజడి రేగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 50 మంది సాయుధ పోలీసులు లివిటిపుట్టుకు చేరుకొని 19 మంది యువకులను తీసుకెళ్లినట్టు సమాచారం. విచారణ కోసం తీసుకెళుతున్నామని పోలీసులు తెలిపారని గ్రామస్థులు పేర్కొన్నారు. విచారణ కోసమయితే పగలు వచ్చి మాట్లాడితే సరిపోతుందని, అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తమవారికి నేతల హత్యలతోగానీ మావోయిస్టులతో గానీ ఎటువంటి సంబంధం లేదని లివిటిపుట్టు మహిళలు వాపోయారు. అయితే, ఆ తరువాత 12 గంటల్లోపే మూడు జీపుల్లో ఆ యువకులను గ్రామంలో పోలీసులు వదిలేసినట్టు సమాచారం.
 
 
సార్‌.. వాళ్లను వదలొద్దు.. డీజీపీ కాళ్లపై పడిన సోమ భార్య
సోమ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన డీజీపీని చూడగానే, ఆయన భార్య ఇచ్చావతి కన్నీటిపర్యంతమయ్యారు. వాళ్లను వదలొద్దు సారూ అంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. ‘‘మాకు తీరని అన్యాయం చేశారు. నా భర్తను ఎటువంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా చంపేశారు.à°ˆ ఘాతుకానికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించండి’’ అని కోరారు. అనంతరం, పాడేరులో కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి, కుమారులను కలుసుకొని ఠాకూర్‌ ధైర్యం చెప్పారు. కాగా, మరో మూడు రోజులు ఆయన విశాఖలో ఉంటారని సమాచారం. కాగా.. మంత్రి లోకేశ్‌ గురువారం విశాఖ వస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విశాఖ రానున్నారు. దీంతో డీజీపీ వచ్చే మూడురోజులు జిల్లాలోనే ఉంటారని తెలిసింది.