విదేశీ బ్యాంకు ఖాతాల్లో 20.38 కోట్లు జమ

Published: Friday September 28, 2018
అక్రమ మార్గాల ద్వారా తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రూ.1000 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టారని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా, భూములు ‘కొనుగోలు’ చేసి ఆదాయాన్ని చూపించకపోవడం, కొన్ని ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, అఫిడవిట్లలో స్పష్టత లేకపోవడం తదితర కారణాలతో ఐటీ విభాగం లోతుగా ఆరా తీసింది. రేవంత్‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, తద్వారా, కోట్ల రూపాయల మనీ లాండరింగ్‌ జరిగిందని గుర్తించింది. అనేక షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. à°ˆ నేపథ్యంలోనే రేవంత్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం..
 
 
విదేశీ ఖాతాల నుంచి 20 కోట్లు!
రేవంత్‌ రెడ్డికి హాంకాంగ్‌, కౌలాలంపూర్‌ల్లో రెండు విదేశీ బ్యాంక్‌ ఖాతాలున్నాయి. 2014 ఫిబ్రవరి 25à°¨ 20 లక్షల సింగపూర్‌ డాలర్లు హాంకాంగ్‌లోని ఆయన ఈస్ట్‌ ఏషియా బ్యాంక్‌ ఖాతా నంబర్‌ 1260779653146లో జమయ్యాయి. అదే రోజున మురళీ రఘువరన్‌ ఖాతా నుంచి 60,09,000 మలేషియా రిగ్గెట్స్‌ కౌలాలంపూర్‌లో రేవంత్‌ రెడ్డికి చెందిన ఆర్‌బీహెచ్‌ 100482930330069 ఖాతాలో జమయ్యాయి. à°ˆ రెండు లావాదేవీల విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.20.38 కోట్లు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందే à°ˆ లావాదేవీలు జరిగాయి. అయినా, ఎన్నికల అఫిడవిట్‌, ఐటీ రిటర్న్స్‌ల్లో వీటిని చూపించలేదు. సింగపూర్‌, మలేషియాల్లోని బహుళ అంతస్తుల భవనాల విక్రయాలతో à°ˆ సొమ్ము వచ్చినట్లు ఆరోపణలున్నాయి.
 
 
అయితే, అసలు రేవంత్‌ రెడ్డి విదేశాల్లో ఆస్తులు ఎప్పుడు కొన్నారు!? వాటికి నిధులు ఎలా సమకూర్చారు? తదితర వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అలాగే, రేవంత్‌ రెడ్డి తన సోదరుడు కొండల్‌ రెడ్డితో కలిసి హవాలా పద్ధతిలో సొమ్మును దుబాయ్‌కు తరలించినట్లు ఆరోపణలున్నాయి. మరో సోదరుడు జగన్‌ రెడ్డి పేరున అమెరికాలో à°’à°• పెట్రోల్‌ బంక్‌ను కొనుగోలు చేసినట్లు అభియోగం. వీటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎలా తరలించారనే దానిపై ఐటీ దృష్టిసారించింది.
 
 
షెల్‌ కంపెనీలతో మనీ లాండరింగ్‌
సాయి మౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరో 28 కంపెనీలను రేవంత్‌ రెడ్డి ఇంటి అడ్ర్‌సతో రిజిస్టర్‌ చేశారు. రేవంత్‌ బావమరిది ఎస్‌.జయప్రకాశ్‌తోపాటు వీటిలో మొత్తం 23 మంది డైరెక్టర్లు ఉన్నారు. జయప్రకాశ్‌ డైరెక్టర్‌à°—à°¾ ఉన్న సాయి మౌర్య ఇన్‌ఫ్రా కూడా రేవంత్‌ ఇంటి అడ్ర్‌సతోనే ఉంది. అయితే, à°ˆ కంపెనీల్లో అసలు ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ఇక, రేవంత్‌ మామ ఎస్‌.పద్మారెడ్డి పేరిట 2001లో నైమిష మైనింగ్‌ కంపెనీ ఏర్పాటైంది. కానీ, దీని తరఫున 2011లో మాత్రమే రిటర్న్స్‌ దాఖలయ్యాయి. ప్రస్తుతం ఇది మూతపడింది. దుర్గ పెట్రోలియం ప్రొడక్ట్‌దీ ఇదే పరిస్థితి. అమాంచ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాక్టివ్‌à°—à°¾ ఉంది. దానిలోంచి విజయ మగధ ప్రాజెక్టులు, సాయి రోజా కన్‌స్ట్రక్షన్స్‌ వంటి కంపెనీలు ఏర్పడ్డాయి. రేవంత్‌ తన అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో à°ˆ షెల్‌ కంపెనీలను సృష్టించారు. వీటిద్వారా 200-300 కోట్లమేర మనీలాండరింగ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.