అలా అయితేనే విచారణ నిలిపేస్తాం

Published: Saturday September 29, 2018
 à°µà±ˆà°¸à±€à°ªà±€ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తేనే వీటి విచారణను నిలిపివేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో జగన్‌ తదితరులపై దాఖలైన 11చార్జిషీట్లలో కోర్టు విచారణ ఇక ఊపందుకోనుంది. అలాగే ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓఎంసీ కేసుల్లోనూ కోర్టు విచారణ వేగం పుంజుకుంటుందని సమాచారం. జగన్‌ కేసుల్లో పలువురు నిందితులు సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
 
అయితే క్రిమినల్‌ కేసులో కింది కోర్టుల్లో విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు దాటితే.. ఆయా కేసుల్లో తాజాగా స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు లేకపోతే à°† కేసుల విచారణ ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్‌, ఎమ్మార్‌, ఓఎంసీ కేసులకు సంబంధించి à°† 6 నెలల గడువు ముగిసిపోయింది. à°ˆ నేపథ్యంలో మళ్లీ నిందితులు తాజాగా హైకోర్టు నుంచి స్టే పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకుంటేనే విచారణ నిలిపివేస్తామని.. లేదంటే విచారణను కొనసాగిస్తామని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణలోగా స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయకపోతే.. సీబీఐ కోర్టులో విచారణ ముందుకు సాగనుంది. ఇంకోవైపు.. అక్రమాస్తుల కేసుల్లో శుక్రవారం కోర్టులో జగన్‌, పలువురు నిందితులు హాజరయ్యారు. తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదాపడింది.
 
ఆ చట్ట సవరణలు సాయిరెడ్డికి వర్తించవు
మరోవంక.. అవినీతి నిరోధక (పీసీ) చట్టానికి పార్లమెంటు తాజాగా చేసిన సవరణలు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులకు వర్తించవని సీబీఐ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీపీ సురేందర్‌ కోర్టుకు తెలియజేశారు. పబ్లిక్‌ సర్వెంట్‌పై విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరంటూ à°ˆ ఏడాది జూలైలో సవరణ తీసుకొచ్చారని, అయితే à°ˆ సవరణ జూలై తర్వాత నమోదు చేసిన కేసుల్లో ఉన్న నిందితులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. విజయసాయిరెడ్డిపై పీసీ యాక్టు à°•à°¿à°‚à°¦ నమోదు చేసిన అభియోగాలకు అనుమతి అవసరం లేదని నివేదించారు.