ఎత్తిపోతల తరహాలో బ్యాంకుల నుంచి రుణం

Published: Wednesday October 03, 2018
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సాయం చేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఏకోశానా లేదని రాష్ట్రప్రభుత్వానికి అవగతమైంది. జాతీయ హోదా ప్రకటించి నాలుగేళ్లు దాటినా.. ఇప్పటిదాకా ప్రధాన పనుల డిజైన్లను ఆమోదించలేదు. 2013-14 సవరణ అంచనాల ఆమోదానికి కేంద్రం మోకాలడ్డుతుండడంతో.. ఇక దానిపై ఆధారపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ముందు సొంత నిధులను ఖర్చుపెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పించారు. ఇందుకోసం జలవనరుల అభివృద్ధి సంస్థ (డబ్ల్యూఆర్‌డీసీ) ద్వారా వాణిజ్య బ్యాంకు à°² నుంచి రుణసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు ఎత్తిపోతల పథకాలకు రూ.4,000 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. నిజానికి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి రూ.10,000 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దీనికి ఇంతవరకు సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి.
 
తర్వాత రీయింబర్స్‌మెంట్‌ యత్నాలు!
2019 జూన్‌నాటికి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించాలంటే.. కేంద్ర నిధుల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం అనవసరమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ముందు సొంత నిధులతో పూర్తిచేసి.. ఆనక కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రయత్నించి సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే.. పనుల్లో వేగం తగ్గుతుందని, లక్ష్యాన్ని చేరుకోలేమని ముఖ్యమంత్రి కలవరపడుతున్నారు. సోమవారం జలవనరుల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ‘పోలవరం ప్రాజెక్టు తొలి డీపీఆర్‌ను 1984లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపించింది. దీనిపై జల సంఘం అప్పట్లోనే కొర్రీలు వేసింది. ఏకంగా 80 కొర్రీలు వేసి వెనక్కి పంపడంతో à°ˆ ప్రాజెక్టుకు సా యం చేసేందుకు కేంద్రం ఆసక్తిగా లేదని అర్థమైంది. ఇప్పుడు.. 2013-14 సవరించిన అంచనాల విషయంలోనూ ఇదే పునరావృతమైంది. 2017లో తుది అంచనాలను జల సంఘానికి పంపితే.. ఏడాదిలో తొమ్మిది సార్లు కొర్రీలు వేసింది. చివరకు సొంతగా à°’à°• ఫార్మాట్‌ ఇచ్చి.. దాని ప్రకారం సమాచారం కావాలని కోరింది.
 
సర్వే నంబర్లు, వ్యక్తిగతంగా భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారం, ముంపునకు గురయ్యే గ్రామాల్లోంచి ఖాళీ చేసిన వారికి అమలు చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాల సమాచారాన్నంతటినీ క్రోడీకరించి.. అదే ఫార్మాట్‌లో అందజేయబోతున్నాం. ఈఎన్‌సీ à°Žà°‚.వెంకటేశ్వరరావు బృందం బుధవారం ఢిల్లీ వెళ్తోంది. జల సంఘానికి à°† సమాచారం ఇచ్చిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌ సూచించారు. జల సంఘానికి నివేదిక ఇవ్వగానే ఆయన వద్దకు వెళ్తాం’ అని జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ చెప్పారు.
 
అనుకున్న గడువుకు పూర్తికావాలి..
కేంద్రం ప్రతిసారీ ఇదిగో అదిగో అంటూనే ఉందని చంద్రబాబు ఆక్షేపించారు. ‘త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదు. పోలవరం హెడ్‌వర్క్స్‌ అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. వర్షాకాలం ముగిసినందున కాంక్రీట్‌ పనుల్లో వేగాన్ని పెంచాలి. ఇందుకు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి రానివ్వొద్దు. వాణజ్య బ్యాంకుల ద్వారా రుణం తీసుకొచ్చి, పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరపాలి. కేంద్రం నుంచి నిధులొచ్చాక à°ˆ రుణాలకు జమ చేయవచ్చు’ అని సూచించారు. డబ్ల్యూఆర్‌డీసీ ద్వారానే బ్యాంకుల నుంచి రుణసమీకరణ చేస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తెలిపారు.