బీజేపీతో లాలూచీకి ఇదే నిదర్శనం

Published: Monday October 08, 2018

తేదీలు, గంటలు అన్నీ లెక్క చూసుకొనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని, à°† లెక్క మరోసారి సరిచూసుకునే స్పీకర్‌ వాటికి ఆమోదం తెలిపారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం విమర్శించారు. ఏడాదికి ఒకరోజు ముందు చేశారు కాబట్టి ఉపఎన్నికలు రావని తాజాగా ఎన్నికల కమిషనర్‌ చెప్పారన్నారు. వైసీపీ-బీజేపీల లాలూచీకి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని యనమల ప్రశ్నించారు. మరోవైపు 2019 ఎన్నికలు సుస్థిర-అస్థిర ప్రభుత్వాలకి మధ్య జరిగేవని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అనడంపై మండిపడ్డారు. సుస్థిర ప్రభుత్వం అంటే ప్రజలను, బలహీనవర్గాలను అణచివేసేదా? ఐటీ, ఈడీ, సీబీఐలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేసేదా? ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేదా? అని ప్రశ్నించారు. మోదీ విదేశీ పర్యటనలన్నీ ఫార్సు ఒప్పందాల కోసం, అవినీతి కోసమేనని ఆరోపించారు. రాఫెల్‌ ఒప్పందం, ధరల పెరుగుదల, రూపాయి పతనం అంశాలపై మోదీ ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడడం లేదని యనమల ప్రశ్నించారు. సుస్థిరత పేరుతో ప్రజలిచ్చిన తీర్పును మోదీ ప్రభుత్వం కాలసరాసిందన్నారు. ఎన్నికల కమిషన్‌ను కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు.