హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌కు భూమిపూజ

Published: Tuesday October 09, 2018
‘‘రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ ఏర్పాటు చరిత్రాత్మకం. ఇది ప్రారంభం మాత్రమే. హైదరాబాద్‌లో ఐటీకి ఏ విధంగా సీఎం చంద్రబాబు పునాదులు వేశారో.. ఏపీలో కూడా అలాగే ముందుకెళుతున్నారు. ఐటీ పునాదుల మీద అంచెలంచెలుగా ఎదుగుతాం. అనేక సంస్థలు మాతో మాట్లాడుతున్నాయి. ఎక్కడా లేనివిధంగా మనదగ్గర యువ నైపుణ్యాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు’’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఐటీలో ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారని, 43 వేల ఉద్యోగాలను à°ˆ రంగంలో కల్పించి.. అదెలా సాధ్యమనేది చేతల్లో చేసి చూపించామని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఐటీరంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం. à°ˆ రెండు రంగాల్లో కలిపి 2019 నాటికి మొత్తం రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం’’ అని వివరించారు. సోమవారం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు.
 
నాయకత్వం, దూరదృష్టి ఉంటే ఏదైనా సాధించవచ్చునని, దీనికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రంగాల్లో ఎదిగిన తీరే నిదర్శనమని à°ˆ సందర్భంగానూ, అనంతరం మీడియా సమావేశంలోనూ లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘‘1965లో సింగపూర్‌ వెనుకబడిన à°“ మత్స్యకార ప్రాంతం. లీ కువాన్‌ అనే నాయకుడి విజన్‌తో బలమైన ఆర్థిక, పర్యాటక శక్తిగా సింగపూర్‌ ఎదిగింది. చైనా, ఇండియా తలసరి ఆదాయం 1988లో సమానం. జియోపింగ్‌ ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశం కంటే నాలుగురెట్లు అధికంగా తలసరి ఆదాయం ఇప్పుడు చైనా పొందుతోంది. ఇదే కోవలో తమిళనాడులోని à°’à°• చిన్నగ్రామంలో పుట్టి, సాధారణ స్కూల్‌లో చదువుకున్న శివనాడార్‌..దేశంలోనే ఐదు ఉత్తమ ఐటీ సంస్థలలో à°’à°•à°Ÿà°¿à°—à°¾ హెచ్‌సీఎల్‌ ని నిలిపారు’’ అని కొనియాడారు. కేసరపల్లిలో ఏర్పాటుచేస్తున్న హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద సెంటర్‌à°—à°¾ ఉండబోతున్నదన్నారు.కాగా, యువనేస్తం ద్వారా 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి నిరుద్యోగ భృతిని ఇవ్వడమే కాదు..స్కిల్‌ డెవల్‌పమెంట్‌, పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిని ఇబ్బంది పెట్టడానికే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. 16 కేసులు ఎదుర్కొంటున్న వారు.. విశ్వసనీయత, అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంటూ పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడ్డారు. మొత్తం 19 బృందాలు, 200 మంది à°…à°‚à°¤ భారీ హడావుడి చేస్తున్నప్పుడు.. అనుమానం రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలపై దాడులు చేస్తుంటే ఎందుకు స్పందిస్తున్నారన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆంరఽధా సంస్థలపై దాడులు చేస్తున్నప్పుడు, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా అని ప్రశ్నించారు.
 
 
ఉద్యోగాలు కల్పించడమే తప్పా: లోకేశ్‌
ఐటీ సంస్థలకు భూముల కేటాయింపులపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించటమే తాము చేసిన తప్పా అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘హెచ్‌సీఎల్‌, జోహో, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ వంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి తీసుకు రావటం తప్పా? వాటికి భూములు ఇవ్వడం తప్పా? ఏపీలో పుట్టిపెరిగిన కంపెనీలకు భూములు ఇవ్వడం తప్పా?’’ అంటూ నిలదీశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో రోషిణీ నాడార్‌ మల్హోత్రా వివరించారు. వేయిమందితో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, హెచ్‌సీఎల్‌ వైస్‌ చైర్మన్‌ శిఖర్‌ మల్హోత్రా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, విజయానంద్‌, బాబు.à°Ž తదితరులు పాల్గొన్నారు.