‘తితలీ’ తుపాను...

Published: Wednesday October 10, 2018
విశాఖపట్నం: ‘తితలీ’ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్‌రోడ్డుపైకి అలలు దూసుకువస్తున్నాయి. రాగల 12 గంటల్లో తితలీ తుఫాను తీవ్ర తుఫాన్‌à°—à°¾ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలల ఉధృతి అధికంగా ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
 
తితలీ తుపాను కళింగపట్నానికి ఆగ్నేయంగా 340కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తెల్లవారుజామున కళింగపట్నం- గోపాల్‌పూర్‌ మధ్య ఏపీని ఆనుకుని తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. అటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది.