అమ్మ దర్శనానికి జర్మన్‌, ముస్లిం మహిళలు

Published: Saturday October 13, 2018
విజయవాడ: à°…మ్మపై భక్తి ఎల్లలు దాటిచ్చింది. సముద్రాలు దాటి ఇంద్రకీలాద్రి చేర్చింది. దేశ సరిహద్దులే కాదు.. మత అడ్డుగోడలను దాటుకుని వచ్చిన ముస్లిం మహిళలు, జర్మన్‌ మహిళ శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఏటా దర్శించుకుంటోన్న à°† ముస్లిం కుటుంబం à°ˆ ఏడాది దసరా ఉత్సవాల్లోనూ దర్శనానికి క్యూ లైన్‌కు చేరారు.
 
పొత్తిళ్లలో పసిబిడ్డను ఎత్తుకున్న కుమార్తెను వెంటబెట్టుకుని వచ్చిన à°† మహిళ దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తోంది. దసరా ఉత్సవాల్లో à°šà°‚à°¡à±€ హోమం చేయించుకోవడంతో శారీరక, మానసిక బాధలన్నీ దూరమయ్యాయని, ఏటా ఇలాగే వస్తానని వెస్ట్‌ జర్మనీలోని లింబర్గ్‌కు చెందిన లివియా అనే మహిళ అంటోంది. దేశాలు దాటుకుని, మత పట్టింపులు వదిలి ఇంద్రకీలాద్రి చేరిన à°ˆ మహిళలను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది.
 
 
ఎన్నో ఏళ్లుగా వస్తున్నాం
మేము విజయవాడలోనే ఉంటాం. ఎన్నో ఏళ్లుగా ఇలా దసరా సమయంలో అమ్మవారి దర్శనానికి వస్తుంటాం. మేమే కాదు.. మాతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడకు వస్తుంటారు. అయితే మా గురించి అందరికీ చెప్పుకోవడం నచ్చదు.
-ముస్లిం మహిళలు
 
 
రెండేళ్లుగా వస్తున్నాను
దసరా ఉత్సవాల్లో à°šà°‚à°¡à±€ హోమం చేయించుకోవడం నాకు అలవాటుగా మారింది. రెండేళ్ల క్రితం దుర్గమ్మ మహాత్మ్యం తెలుసుకున్నాను. అప్పటి నుంచి దసరా ఉత్సవాలకు మూడు నెలలు ముందుగా ఇండియాకు వచ్చి మదనపల్లెలోని మదర్‌ మీరా ఆశ్రమానికి వెళ్తాను. అక్కడే కొన్నాళ్లు ఉండి ఉత్సవాల సమాయానికి చేరుకుంటాను. హోమం అనంతరం ఇక్కడే ఐదు రోజులు ఉండి రోజూ అమ్మ దర్శనం చేసుకుంటాను. అలా చేయడం వల్ల నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.