ఐటీ టెర్రర్‌!...రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం

Published: Sunday October 14, 2018
రాష్ట్రంలో ఐటీ సోదాలు సృష్టిస్తున్న టెర్రర్‌కు ఉదాహరణలు ఇవి! ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న, బడా కంపెనీలపైనే ఐటీ ‘ఫోకస్‌’ పెట్టినప్పటికీ... వీరితో ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు, సంస్థల్లోనూ ఎన్నడూ లేనంత అప్రమత్తత కనిపిస్తోంది. ‘ఎందుకైనా మంచిది’ అంటూ ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. భారీ లావాదేవీల మాటెత్తడానికే భయపడుతున్నారు. ఐటీ సోదాలు జరగడం కొత్తేమీ కాదు. à°’à°• వ్యక్తి లేదా సంస్థ లావాదేవీలకు... కడుతున్న పన్నుకూ మధ్య పొంతన లేదని భావిస్తే, తగిన సమాచారాన్ని సేకరించి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటారు.
 
 
కానీ... రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఇటీవల 200 మంది సిబ్బంది 19 బృందాలుగా విడిపోయి వీర విహారం చేశారు. ఒకరోజు, రెండు రోజులు కాకుండా... రోజుల తరబడి అదే పనిగా వేడి కొనసాగిస్తున్నారు. దీంతో à°ˆ వ్యవహారంతో సంబంధం లేని వారు కూడా బెంబేలెత్తుతున్నారు. పలువురు రియల్టర్లు, వ్యాపారులు అసలు ఇప్పుడేమీ కొత్త లావాదేవీలు వద్దు, ఒప్పందాలు, రిజిస్ర్టేషన్లు వద్దే వద్దు అన్న స్థాయికి వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవాళ్లే కాకుండా...à°’à°• మాదిరిగా వ్యాపారాలు చేసేవారూ టెన్షన్‌ పడుతున్నారు.
 
 
నాలుగేళ్ల సమాచారం ఆరా...
‘ఐటీ దాడుల విషయంలో అనవసరపు ఆందోళన’ అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే... ఐటీ శాఖ చాలా లోతుల్లోకి వెళ్లి మరీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ‘‘à°—à°¤ నాలుగేళ్లుగా భారీగా లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలన్ని మాకు చెప్పండి’ అంటూ బ్యాంకులకు ఐటీ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జాగ్రత్త పడినప్పటికీ... పాత లెక్కలను తీసి పక్కాగా పట్టుకోవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
 
మరీ ముఖ్యంగా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కంపెనీలు, సంస్థలు నిర్వహించిన లావాదేవీల వివరాలను పలు బ్యాంకులనుంచి ఐటీ శాఖ సేకరిస్తున్నట్లు తెలిసింది. లక్ష్యంగా నిర్ణయించుకున్న కంపెనీల బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. ఒకచోట తీగ దొరికితే గొలుసుకట్టుగా డొంకను కదిలించుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహారం క్రమంగా వ్యాపార వర్గాల్లోకి చేరుతుండడంతో గుబులు మొదలైంది.
 
 
చిన్న మొత్తాలనూ వదలకుండా...
ఒకవ్యక్తి ఇతర ప్రాంతాలకు చిరుద్యోగులను, కార్మికులను పంపిస్తుంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి...తొలి జీతం అందుకున్న తర్వాత కొంత మొత్తాన్ని ఆయన ఖాతాలో జమ చేస్తుంటారు. à°ˆ ఖాతాను కూడా ఐటీ పట్టుకుంది. సదరు వ్యక్తిని పిలిపించి విచారించింది. à°—à°¤ నాలుగేళ్ల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ను ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది.