అమ్మవారి సన్నిధిలో సీఎం పట్టు వస్ర్తాలు సమర్పణ

Published: Monday October 15, 2018
పోలవరం మొదలుకొని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తిచేసి రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చల్లగా చూడాలని ఇంద్రకీలాదిప్రై కొలువైన కనకదుర్గమ్మను కోరుకున్నానని సీఎం చంద్రబాబు చెప్పా రు. అమరావతి నిర్మాణంతోపాటు, రాష్ర్టాన్ని నాలెడ్జ్‌ హబ్‌à°—à°¾ తీర్చిదిద్దాలని, సంపద సృష్టించాలని ప్రార్థించానని చెప్పారు. ఆదివారం కనకదుర్గమ్మ జన్మనక్షత్రం మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారం లో కొలువుతీరిన దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్ర్తాలు సమర్పించారు. సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయా నికి చేరుకున్నారు. వారిని కలెక్టర్‌ లక్ష్మీకాంతం సాదరం à°—à°¾ ఆలయంలోకి ఆహ్వానించారు. దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 
 
అనంతరం మీడియా పాయింట్‌లో సీఎం మాట్లాడుతూ à°—à°¤ ఏడాది కంటే భక్తుల తాకిడి రెట్టింపు అయ్యిందన్నారు. దసరా ఉత్సవాల 4 రోజుల్లో అమ్మవారిని 7,24 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ పనులను కాంట్రాక్టర్‌ సరిగా చేయటం లేదని, రూ.10 కోట్లు ఇచ్చి మరీ పనులు చేయిస్తున్నామని, సమీక్షిస్తున్నామని తెలిపారు. ఫ్లై ఓవర్‌ నుంచి దేవాలయానికి ప్రత్యేక మార్గం వస్తుందని, దీనివల్ల ఇంద్రకీ లాద్రికి మరింత అందం వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
కాగా, చంద్రబాబు మంగళవారం మళ్లీ శ్రీకాకుళం వెళ్లనున్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సీఎం అక్కడే ఉంటారు. ఇప్పటికే బాగా దెబ్బతిన్న మండలాలకు మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించారు. విద్యుత్‌ సరఫరా, ఆహారం, మంచినీరు, పారిశుధ్యం, రోడ్ల పునరుద్దరణపై దృష్టిపెట్టి పనిచేయాలని నిర్దేశించారు.