సీఎం అయ్యాక చేస్తానంటే ఎలా?

Published: Wednesday October 17, 2018
‘బలప్రదర్శన చేయాల్సి వస్తే.. శత్రువైనా మిగలాలి, నేనైనా మిగలాలి... కవాతు బల ప్రదర్శన కాదు.. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి ప్రజలు చేసిన హెచ్చరిక.. దాదాపు పది లక్షల మంది ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు చేశారు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని షెల్టన్‌ హోటల్‌లో మంగళవారం ఆయన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘వారు నన్ను చూడడానికి రాలేదు.. పలావు ప్యాకెట్‌కో, సారా ప్యాకెట్‌కో ఆశపడి రాలేదు.. దోపిడీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేయడానికి వచ్చారు’ అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బాధ్యతగా వ్యవహరించాలని, అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తానంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
 
దేశం కాని దేశం వచ్చిన కాటన్‌దొర గుర్రంపై తిరిగి క్షామంతో అల్లాడిపోతున్న గోదావరి జిల్లాల ప్రజలను చూసి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఆపడానికి బ్యారేజీ కట్టి సస్యశ్యామలం చేశారని.. అందుకే ఆయన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు కూడా à°…à°‚à°¤ బలంగా ఉంటుందో లేదో చూడాలి. à°…à°‚à°¤ గొప్పగా ప్రాజెక్టు కడితే చంద్రబాబును కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కానీ కాటన్‌ కాంట్రాక్టు తీసుకోలేదు. బడ్జెట్లు పెంచలేదు. కేవీ రావులా కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు కొనలేదు’ అని ఎద్దేవా చేశారు.
 
తెలుగోడినని చెప్పడానికే పంచెకట్టు
à°ˆ సమావేశానికి పంచెకట్టులో వచ్చిన పవన్‌.. తెలుగువాడినని చెప్పడానికే పంచె కట్టు కట్టానని చెప్పారు. ‘మన వ్యవస్థ, జాతి, సంప్రదాయాలను కాపాడాలన్నదే నా ఉద్దేశం. అందరూ చూసే వ్యక్తి పంచెకడితే గౌరవం వస్తుంది’ అని తెలిపారు. గోదావరి జిల్లాలు తన మూలాలు ఉన్న ప్రాంతమని చెప్పారు. కులాల మధ్య ఐక్యత అవసరమన్నారు. ‘పాపాలు చేసి గడ్డివాములో దాక్కుంటే పిడుగు పడదా! కోట్లను, కోటీశ్వరులను వెనకేసుకువచ్చే ప్రభుత్వాలు వద్దు. రోడ్ల మీద, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వారు, తిండి లేకుండా ఇబ్బంది పడేవారి కోసం ప్రభుత్వం కావాలి’ అని స్పష్టం చేశారు. తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. ఉద్యోగాలివ్వకుండా మూడు పంటలు పండే భూములు లాగేసుకుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు. ‘విశాఖ బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని చూస్తే నాకు à°’à°• పెద్ద కొండ కనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది. కానీ కొంతమందికి డబ్బు మూటలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో ఉంటే మరోలా మాట్లాడతారు’ అని పవన్‌ ఆక్షేపించారు.