ఓటమి భయంతో ఫ్లెక్సీలు చింపుతున్నారు

Published: Wednesday October 17, 2018
అన్ని పనుల్లోనూ ప్రభుత్వం దళారులను పెట్టి కాలం వెళ్లదీస్తోందని, ఎమ్మెల్యేలు చిన్న ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. à°ˆ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కిల్లాడ అనూరాధ అనే విద్యార్థిని జగన్‌ను కలసి గోడు వినిపించింది. ఎంపీహెచ్‌వో చదివిన తనకు గజపతినగరంలో ఉద్యోగం రావాల్సి ఉందని, తన పోస్టును ఎమ్మెల్యే అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. దీనిపై జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎంపీహెచ్‌వో పోస్టును సాక్షాత్తు ఎమ్మెల్యే అమ్ముకోవడం దారుణమని, ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదన్నారు. రానున్న తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేటట్టు చూస్తానని భరోసా ఇచ్చారు.
 
బాడంగి సీహెచ్‌సీని 60 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని స్థానికులు వినతిపత్రాన్ని అందజేశారు. 104 సిబ్బంది జగన్‌ను కలిసి పదేళ్లుగా 104లో పనిచేస్తున్నామని, ఉద్యోగభద్రత కల్పించాలని, రూ.10 వేల జీతంతో ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. తెలంగాణలో పనిచేస్తున్న 423 మంది ఆంధ్ర టీచర్లను ఏపీకి బదిలీ అయ్యేలా చూడాలని కోరుతూ పలువురు ఉపాధ్యాయులు వినతిపత్రం ఇచ్చారు. బాడంగి, ముగడ, చినభీమవరం, పెద భీమవరంలో జగన్‌ పాదయాత్ర చేశారు. కాగా, ముగడలో వైసీపీ కార్యకర్తలు కట్టిన దాదాపు 50 ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. à°ˆ విషయం తెలుసుకున్న జగన్మోహన్‌రెడ్డి బొబ్బిలి ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణరంగారావు ఓటమి భయంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అన్నారు.