నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియడం లేదు

Published: Thursday October 18, 2018
‘‘సిక్కోలుకు వచ్చిన కష్టం, à°ˆ ప్రాంతానికి జరిగిన నష్టం అపారం. తుఫాను బాధిత ప్రాంతాలు కకావికలమయ్యాయి. అయితే, à°ˆ నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియడం లేదు. కేరళకు తుఫాను వస్తే ప్రపంచమంతా కదిలింది. à°† స్థాయి స్పందన కనిపించడం లేదు. à°† బాధ్యతను జనసేన తీసుకొంటుంది. వీడియోల ద్వారా తితలీ తీవ్రతను ప్రపంచమంతా చాటుతాం’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
 
ఉద్దానంలో లక్షలాదిమంది రోడ్డునపడి బాధలు పడటం చూస్తే కన్నీరు ఆగడం లేదన్నారు. బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. తుఫాను బాధిత ప్రాంతాలయిన టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు, పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరులో బుధవారం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. à°ˆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
 
‘‘మాటల్లో కాదు.. చేతల్లో ఆదుకోవాలి. కంటితుడుపు చర్యలు తప్ప పూర్తిస్థాయిలో బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ విఫలమైంది’’ అని మండిపడ్డారు. తన పర్యటనలో ఆయన పలు గ్రామాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. ఇళ్లు కోల్పోయినవారు, కొబ్బరితోటలు దెబ్బతిన్న రైతులు పవన్‌ను చుట్టుముట్టి తమ కష్టాన్ని ఏకరువుపెట్టారు. భావనపాడులో రచ్చబండ నిర్వహించి మత్స్యకారులతో మాట్లాడారు.
 
అమలపాడు గ్రామంలో బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణ కోసం జనసేన పోరాటం చేసింది. తిరిగి అదే పోరాట సంకల్పంతో తుఫాను బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. మూడురోజులపాటు టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో తిరిగి, జరిగిన నష్టాన్ని జనసేన అంచనా వేస్తుంది. à°† వివరాలను క్రోడీకరించి నష్ట నివేదకను తయారుచేసి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది.’’ అని పేర్కొన్నారు.
 
కాగా, జనసేన తరపున భారతీయులందరికి పవన్‌ కళ్యాణ్‌ à°“ ప్రకటనలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పండగ సమయంలో నేను సంతోషంగా లేను. తుఫానుకు బతుకులు చిన్నాభిన్నమైన ప్రజలందరూ బరువెక్కిన గుండెలతో ఉన్నారు. వారంతా సాధారణ జన జీవనంలోకి వచ్చినప్పుడే మనకు పండుగ రోజు’’ అని à°† ప్రకటనలో పేర్కొన్నారు.