3200 కిలోమీటర్లకు చేరిన పాదయాత్ర

Published: Thursday October 25, 2018
 à°µà±ˆà°¸à±€à°ªà±€ అధినేత జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర బుధవారం విజయనగర జిల్లాలో ప్రజలతో మమేకమవుతూ సాగింది. సాలూరు మండలం సన్యాసిరాజుపేట నుంచి నడక ప్రారంభించారు. పాదయాత్రలో ఎక్కడికక్కడ తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ వారి సమస్యలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. కొందరు మహిళలు, విద్యార్థినులతో సెల్ఫీ దిగారు. పాదయాత్ర బాగువలస గ్రామానికి చేరుకునేసరికి 3200 కిలోమీటర్లు పూర్తి అయింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. à°ˆ సందర్భంగా బాగువలసలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని జగన్‌ ఆవిష్కరించారు. తాను 3200 కిలోమీటర్లు నడిచినందుకు గుర్తుగా మొక్క నాటారు. అనంతరం స్థానికులు అందించిన విల్లుంబును ఎక్కుపెట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాంట్రాక్ట్‌ హెల్త్‌ వర్కర్లు జగన్‌ను కలసి తమ సమస్యలు విన్నవించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘మన ప్రభుత్వం రాగానే రెగ్యులర్‌ చేస్తాన’న్నారు.
 
సాలూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు జర్నలిస్టు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. చాలా మంది విలేకరులు ఇళ్ల స్థలాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. తాను అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు. అనంతరం ఆర్ట్‌అండ్‌ క్రాప్ట్‌ టీచర్లు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు, క్రషర్‌ వర్కర్లు, సహిత విద్యా రిసోర్స్‌ టీచర్లు, ఆశా వర్కర్లు, సర్వ శిక్షాభియాన్‌లో పనిచేస్తున్న సీఆర్పీలు కూడా జగన్‌ను కలసి విన్నపాలు అందజేశారు. మహిళలు, వృద్ధులతో ముచ్చటించారు. దారి పొడవునా కన్పించిన వారందరికీ అభివాదాలు చేస్తూ తాడిలోవ వరకు పాదయాత్ర చేశారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.