విరాట్‌ వరుసగా మూడో సెంచరీ

Published: Sunday October 28, 2018
భారత పర్యటనలో వెస్టిండీస్‌ ఎట్టకేలకు మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో వన్డే వీరోచిత పోరాటాన్ని అణువణువునా నింపుకొన్న à°† జట్టు శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో అమోఘంగా రాణించింది. మొదట టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ షాయ్‌హోప్‌ (113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 95) అర్ధ శతకానికి, చిచ్చరపిడుగు హెట్‌మయెర్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37)కు కెప్టెన్‌ హోల్డర్‌ (39 బంతుల్లో 2 ఫో ర్లు, సిక్సర్‌తో 32) బ్యాటింగ్‌తో పాటు ఆఖర్లో నర్స్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) మెరుపు ఇన్నింగ్స్‌ తోడవడంతో వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 283 పరుగులు చేసింది. బుమ్రా (4/35) నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్‌ యాదవ్‌ (2/52) రెండు వికెట్లు సాధించారు. లక్ష్య ఛేదనలో కోహ్లీ (119 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 107) సెంచరీ చేసినా, ధవన్‌ (45 బంతుల్లో 5 ఫోర్లతో 35) మినహా రాయుడు (27 బంతుల్లో 2 ఫోర్లతో 22), పంత్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 24) అంతంతమాత్రంగానే రాణించడంతో భారత్‌ 47.4 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌటైంది. పార్ట్‌టైం స్పిన్నర్‌ శామ్యూల్స్‌ మూడు, హోల్డర్‌, మెక్‌కోయ్‌, నర్స్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. నర్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నాలుగో వన్డే ఈనెల 29à°¨ ముంబైలో జరగనుంది.
 
కోహ్లీ ఒక్కడే..
చేయాల్సిన పరుగులు ఓవర్‌కు 5.68. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌చూస్తే పెద్దగా కష్టపడాల్సిన లక్ష్యమేమీ కాదు. కానీ టాపార్డర్‌, మిడిలార్డర్‌ వైఫల్యం కొంపముంచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోను ఓపెనర్‌ రోహిత్‌ (8) విఫలంకాగా..ఽధవన్‌, కోహ్లీ దూకుడైన బ్యాటింగ్‌తో రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. దాంతో భారత్‌ విజయం దిశగా సాగినట్టే కన్పించింది. కానీ నర్స్‌ ఆఫ్‌స్పిన్‌ను ఆడలేక ధవన్‌ అవుట్‌కాగా..మెక్‌కోయ్‌ ఫుల్‌లెంగ్త్‌ బంతికి రాయుడు బౌల్డయ్యాడు. ఽఫోర్లు, సిక్సర్లతో తన సహజ శైలిలో ఆడిన పంత్‌ దానిని ఎంతోసేపు కొనసాగించలేకపోయాడు. ఎప్పటిలాగేనే ధోనీ నిరాశపరచగా..38à°µ ఓవర్లో సెంచరీ చేసిన కోహ్లీ..వరుసగా మూడు వన్డేల్లో శతకం సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌à°—à°¾ రికార్డు సృష్టించాడు. ఆపదలో ఆదుకొనే భవనేశ్వర్‌ (10) సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరోవైపు విరాట్‌ ఉండడంతో గెలుపుపై ఆశలు నిలిచిన తరుణంలో విండీస్‌ కెప్టెన్‌ వేసిన à°“ పాచిక అమోఘంగా పారింది. 42à°µ ఓవర్లో పార్ట్‌టైం స్పిన్నర్‌ శామ్యూల్స్‌ను రంగంలోకి దించగా అతడి బంతిని పుల్‌చేయబోయిన విరాట్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అంతే..స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఉన్న ఆఖరి ఆశ అడుగంటింది. à°† తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.