ఆంధ్రా కశ్మీర్‌లో పెరిగిన చలి తీవ్రత

Published: Sunday October 28, 2018

విశాఖపట్టణం: à°†à°‚ధ్రా కశ్మీర్ à°—à°¾ పేరొందిన విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ప్రతి ఏటా నవంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మొదలవుతోంది. అయితే... ఈసారి అక్టోబర్ చివరి వారం నుంచే చలి పులి చంపేస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కాగా... ఆదివారం ఉదయం చింతపల్లి ప్రాంతంలో బాగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటలు దాటినా మంచు కమ్మేయడంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే చింతపల్లిలో 8.5 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.