రాష్ట్రంలో 5వేల లోకల్‌ బ్రాండ్లు: లోకేశ్‌

Published: Wednesday October 31, 2018
 à°—్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లే వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో అవుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు కూడా చెప్పారన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రాజకీయ ప్రక్రియలో à°’à°• భాగమని.. అవి వేరు కాదని స్పష్టంచేశారు. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎ్‌సడీజీ)’పై మంగళవారం విజయవాడలో ఉన్నతస్థాయి సంప్రదింపుల సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌శాఖ నిర్వహించిన à°ˆ సదస్సులో పలు రాష్ర్టాల నుంచి వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
ప్రధానంగా ‘సుస్థిర అభివృద్ధిలో స్థానిక ప్రాధాన్యాలు’ అనే అంశంపై చర్చ జరిగింది. à°ˆ సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున లోకేశ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 5వేల లోకల్‌ బ్రాండ్లు ఉన్నాయని చెప్పారు. ‘స్థానిక ఉత్పత్తులు(లోకల్‌ బ్రాండ్ల)కు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. స్థానిక బ్రాండ్లకు à°Žà°‚à°¤ డిమాండ్‌ ఉందనేదానికి అరకు కాఫీయే ఉదాహరణ’ అని తెలిపారు. అరకు కాఫీకి ఇక్కడ కంటే పారిస్‌, లండన్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది’ అని పేర్కొన్నారు. దేశంలో ఆర్టీజీ ఉపయోగిస్తున్న తొలిరాష్ట్రం ఏపీయేనని చెప్పారు. 11స్టార్‌ విధానం అమలుచేస్తున్నామన్నారు.