ఎన్నో చీకటి కోణాలు, మరెన్నో శేష ప్రశ్నలు

Published: Saturday November 03, 2018
 à°¶à°¾à°¸à°¨ సభ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై జరిగినట్లు చెపుతున్న ‘హత్యాయత్నం’లో ఎన్నో చీకటి కోణాలు, మరెన్నో శేష ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. చిన్నదే అయినా à°† కత్తిని అసలు ఏర్ పోర్ట్ లోపలికి ఎవరు, ఎలా అనుమతించారన్నది మొదటి ప్రశ్న. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలం (సి ఐ యస్ యఫ్) వారి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇది ఎలా సాధ్యపడింది? మరి ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సి ఐ యస్ ఎఫ్, కేంద్ర పౌరవిమానయాన శాఖల వైఫల్యం కిందికి రాదా? కాబట్టి కేంద్రప్రభుత్వమే దీని విషయమై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలా? అక్కరలేదా? మరి ఎందుకు ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం దీనిపై à°’à°• విస్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు? దాడి చేసిన వ్యక్తి ఏ మాత్రం ప్రాణహాని చేయని à°’à°• చిన్న కోడి కత్తిని ఎంచుకోవడం, అదికూడా ప్రమాదకరం కాని రీతిలో భుజం కండరంపై గాయం చేయడం కూడా ఇది హత్యాయత్నం కాదేమోననే అనుమానానికి తావిస్తున్నాయి.
 
à°† చిన్న కోడికత్తిని ఘటన జరిగాక గంటన్నర తరువాత స్వాధీన పరచుకున్నారంటే అప్పటిదాకా అది ఎవరి దగ్గర ఉన్నట్లు? టీవీలలో అందరికీ చూపిన à°† కత్తిపై ఎలాంటి నెత్తురు మరకలు లేవు. మరి దానిపై ఉండాల్సిన రక్తపు మరకలను ఎవరు à°•à°¡à°¿à°—à°¿ శుభ్రపరిచారు? దానిపై విషం పూశారేమో అనే అనుమానం వచ్చి దానిని ఫోరెన్సిక్ లాబ్‌à°•à°¿ పరీక్షకు తామే పంపామని కొందరు వైకాపా నేతలు చెప్పడం ఏమిటి? అది నిజమే కనుక అయితే నేరనిరూపణకు ఆధారమైన సాక్ష్యాలను మాఫీ చేసే ప్రయత్నం చేసినందుకు వారు కూడా శిక్షార్హులు అవుతారు కదా? కొందరు వైకాపా నేతలేమో à°† కత్తికి విషం పూశారనీ, ఇంకొందరు విషం పూయలేదు కాబట్టి సరిపోయింది. పూసివుంటే మా నాయకుడు ఏమయ్యేవారు? అనీ అంటూ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు.