నా విశ్వరూపం చూపిస్తా..

Published: Monday November 05, 2018
à°—à°¤ ఎన్నికల్లో తాను మద్దతివ్వకపోతే చంద్రబాబు రిటైరై ఉండేవారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవాచేశారు. తన మద్దతుతోనే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. ‘వైఎస్‌ హయాంలో లక్షల కోట్లు దోపిడీ చేశారు.. జగన్‌ వస్తే కేసులు ఉన్నాయని, అవినీతి పెరిగిపోతుందనే 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చాను. అనుభవం ఉన్న వ్యక్తి కదా అని మద్దతిస్తే ఆయన కూడా అవినీతిలోకే వెళ్లిపోయారు..’ అని విమర్శించారు. ప్రజాపోరాటయాత్రలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో మాట్లాడారు. అధికారం కోసం పార్టీలు మారే నాయకులు వద్దని, సమర్థ యువనాయకత్వం రావాలని ఆకాంక్షించారు. ‘నవతరం అంటే కేసులు ఉన్నవాళ్లు కాదు.. దోపిడీలు చేసేవాళ్లు కాదు.. సమర్థులు.. విలువలున్న బలమైన వ్యక్తులు రావాలి. బాధ్యతతో కూడిన సమర్థులు సీఎం కావాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే వారు వద్దు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడలేని వారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం కాలేరు.. కారాదు.. ఇది శాసనం’ అని ఆవేశంగా అన్నారు. చంద్రబాబు రిటైరవ్వాలని పవన్‌ సూచించారు. ‘తమ్ముళ్లూ.. మీరు త్యాగాలకు సిద్ధపడాలని చంద్రబాబులా అనను. తమ్ముళ్లూ మీ కోసం నేనే త్యాగం చేస్తా..’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
 
ఆండ్రూ మైనింగ్‌ కంపెనీపై ఆగ్రహం
‘ప్రత్తిపాడు మండలం వంతాడలో రూ.3వేల కోట్ల మైనింగ్‌ దోపిడీ జరిగింది. నేను వంతాడ లేటరైట్‌ గనుల వద్దకు వెళ్లకుండా గ్రావెల్‌పోసి అడ్డంపెట్టారు. అరేయ్‌.. మీకే (మైనింగ్‌ యాజమాన్యం) చెబుతున్నా. ఇంత ప్రజాబలం ఉన్న జనసేన వస్తుంటే అడ్డంపెడతారా.. తాట తీసి కూర్చోబెట్టకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు. మా మీదా మీ బోడి ప్రతాపం. వంతాడ ఆండ్రూ కంపెనీ ఆటలు సాగనివ్వం. జనసేన అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం.’